twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నపూర్ణా స్డూడియోస్‌లో అగ్ని ప్రమాదం...కాలిపోయిన సెట్స్

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో సంక్రాంతి రోజు అగ్నిప్రమాదం సంభవించింది. ఎగసిపడిన అగ్నికీలలను అదుపు చేసేందుకు పలు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. స్టూడియోస్‌లోని గోదాములో సంభవించిన ఈ ప్రమాదం వల్ల సమీపాన గల ఫ్లోర్‌ సెట్టింగ్స్‌కు కూడా మంటలు వ్యాపించి కొంత నష్టం వాటిల్లినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా మీడియా ప్రతినిధులను లోనికి అనుమతించలేదు.

    ఒక్కసారిగా స్టూడియోనుంచి మంటలు ఎగసిపడడంతో సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు కబురుచేశారు. రెండు ఫైరింజన్లు సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బ్లాక్‌ బీలో ఒక ఫ్లోర్‌ పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. గతంలోనూ 'డమరుకం' షూటింగ్‌ సెట్స్‌(అన్నపూర్ణ స్టూడియో)లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సినిమా కోసం నిర్మించిన భారీ సెట్స్‌ పూర్తిగా దగ్ధమయ్యాయి.

    ఇక ఈ అగ్నిప్రమాదంలో..రంగం అనే టీవీ పోగ్రామ్ కు చెందిన సెట్స్ దగ్దమైనట్లు తెలుస్తోందియ మిగతా సెట్స్ కు ఏమీ జరగలేదు. అన్నపూర్ణలో అగ్నిప్రమాదం అనగానే...ఏ సినిమా సెట్టింగ్ అని అందరూ కంగారు పడ్డారు. మా టీవీలో వచ్చే రంగంకు చెందిన సెట్స్ ఇవి. సెట్టింగ్స్ కాలిపోవటం అనే నష్టం తప్ప...మరే విధమైన ప్రాణహాని కలగకపోవటంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు.

    English summary
    A fire broke out at Annapurna Studious in Hyderabad due to shot circuit in second and third floors which damaged some of the studio equipments however nobody has been injured in the mishab. As today was holiday nobody were present at the studious. The fire brigade personnel had extinguished the fire in both the floors. There was no report of any casualty. Though the fire broke out due to shot circuit still the police is investigating in the mishab the reasons behind the fire.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X