‘పైసా’ మూవీ పోస్టర్లు, బ్యానర్లు దహనం
హైదరాబాద్ : తెలుగు సినీ నిర్మాత పుప్పాల రమేష్‌కు సంబంధించిన కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో కార్యాలయంలో ఉన్న 'పైసా' మూవీ పోస్టర్లు, బ్యానర్లు దహనం అయ్యాయి. దాదాపు రూ. 5 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం ఎలా సంభవించింది అనేదానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నాని హీరోగా రూపొందుతున్న 'పైసా' మూవీని పుప్పాల రమేష్ ఎల్లోఫ్లవర్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఈ నెల 3వ వారంలో విడుదల కావాల్సి ఉంది. అందులో భాగంగానే పోస్టర్లు, బేనర్లు తయారు చేసి పెట్టారు.
ఈ సినిమాలో నాని సరసన కేథరీన్ అనే కొత్త అమ్మాయి నటిస్తుంది. ఈ చిత్రంలో నాని పేరు... ప్ర'క్యాష్'(Pra'cash'). డబ్బు కంటే అతనికి ఏదీ ఎక్కువ కాదు. ఈచిత్రంలో నాని యంగ్ పొలిటీషియన్‌గా కనిపించబోతున్నాడు. దర్శకుడు కృష్ణ వంశీ మార్కుకు ఏమాత్రం తగ్గకుండా ఈచిత్రం ఉండబోతోంది. అన్ని కోణాల్లో తనదైన ముద్దవేస్తూ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











