రామబాణం డిజాస్టర్ నుంచి తప్పించుకున్న మెగా హీరో.. అలా రిజెక్ట్ చేయడంతో..

లక్ష్యం, లౌక్యం లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాలతో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన హీరో గోపీచంద్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన హీరోగా తాజాగా తెరకెక్కిన చిత్రం రామబాణం. డింపుల్ హయతి హీరోయిన్ గా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొంది ఈ చిత్రం మే 5వ తేదీన థియేటర్లలోకి వచ్చింది.కానీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో పెద్దగా సక్సెస్ కాలేదు. మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ గా నిలిచినప్పటి నుంచి ఈ వార్త వైరల్ అవుతోంది. అయితే అందరినీ అంతగా ఆశ్చర్యపరుస్తున్న ఆ వార్త ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

First choice hero for Ramabanam movie and rejected reasons

అయితే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ గోపీచంద్ కాదంట. ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, వరుణ్ తేజ్ ని హీరోగా తీసుకోవాలని భావించారట. ఈ క్రమంలోనే కథ కూడా చెప్పారట. ఇందుకు ఆయన కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అయి ఓకే కూడా చెప్పారట. అయితే అప్పటి వరకు వరుణ్ తేజ్ కు ఎలాంటి కమర్షియల్ మసాలా సినిమాలు రాలేవు. ఈ క్రమంలోనే మనసు మార్చుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమా తాను చేయనని చెప్పారట.

దాని తర్వాత ఈ సినిమా గోపీచంద్ దగ్గరకు వెళ్లడం ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయి. సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని రిలీజ్ ఫ్లాప్ గా కూడా నిలిచింది. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ ఫ్లాప్ సినిమాను తమ అభిమాన హీరో చేసుంటే మరో డిజాస్టర్ అతనికి వచ్చేదని.. ఆయన చేయక పోవడమే మంచిది అయిందని అంటున్నారు. వరుణ్ ఈ సినిమాను వదులుకొని మంచి పని చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు.

First choice hero for Ramabanam movie and rejected reasons

రామబాణం చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లీవ్ దక్కించుకుంది. మరికొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. థియేటర్లలో ఆడని ఈ చిత్రం కనీసం ఓటీటీలోనైనా అభిమానుల్ని అకట్టుకుంటుందో లేదో చూడాలి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X