For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫస్ట్ డే ఫస్ట్ షో ట్విట్టర్ రివ్యూ: సినిమాకు షాకింగ్ టాక్.. ఏది ప్లస్ అవ్వాలో అదే మైనస్‌గా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో గతంలో కంటే ఈ మధ్య కాలంలో హస్యప్రధమైన చిత్రాలు చాలా తక్కువగానే వస్తున్నాయి. దీంతో అలాంటి సినిమాల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇలా ఆ మధ్య వచ్చిన 'జాతి రత్నాలు' సినిమా బంపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీని తెరకెక్కించిన దర్శకుడు అనుదీప్ కేవీ అందించిన స్టోరీతో తాజాగా విడుదలైన చిత్రమే 'ఫస్ట్ డే ఫస్ట్ షో'. ఇద్దరు కొత్త కుర్రాళ్లు దర్శకులుగా పరిచయం అవుతోన్న ఈ చిత్రం వినూత్నంగా ప్రచారం చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో అసలు దీనికి ఎలాంటి టాక్ వచ్చింది? ఈ సినిమాను చూసిన వాళ్లు ట్విట్టర్‌లో ఎలాంటి కామెంట్లు చేస్తున్నారు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి!

  ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం వచ్చేశారు

  ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం వచ్చేశారు

  శ్రీకాంత్ రెడ్డి, సంచిత జంటగా నటించిన చిత్రమే 'ఫస్ట్ డే ఫస్ట్ షో'. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాకు అనుదీప్ కేవీ కథను అందించాడు. ఇక, ఈ చిత్రాన్ని లెజెండరీ ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వర్రావు మనవరాలు శ్రీజ నిర్మించారు. ఈ మూవీకి రాధాన్ సంగీతాన్ని అందించారు. ఇందులో వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు.

  ఆ సీరియల్ నటితో ప్రేమలో పడ్డ హైపర్ ఆది: ఆ షోలో బయటపెట్టిన కమెడియన్

  అలాంటి స్టోరీతో వచ్చిన మూవీ

  అలాంటి స్టోరీతో వచ్చిన మూవీ

  పల్లెటూరి బ్యాగ్రౌండ్‌తో వచ్చిన హాస్య ప్రధమైన చిత్రమే 'ఫస్ట్ డే ఫస్ట్ షో'. కాలేజ్‌లో ఓ అమ్మాయిపై అబ్బాయి మనసు పడడం.. ఆమెను ఇంప్రెస్ చేయడం కోసం ఆ కుర్రాడు ఎన్నో పనులు చేయడం.. చివరికి ఆమె కోరిక తీర్చడం కోసం ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు తీసుకోవడం కోసం కష్టపడడం అనే నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. దీనిపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

  అంచనాలు తగ్గట్లుగా బిజినెస్

  అంచనాలు తగ్గట్లుగా బిజినెస్

  వినూత్నమైన సబ్జెక్టుతో రూపొందిన 'ఫస్ట్ డే ఫస్ట్ షో' సినిమా ప్రమోషన్ సరికొత్తగా సాగింది. అందుకే దీని నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని బిజినెస్ జరిగిందని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

  అషు రెడ్డి అందాల ప్రదర్శన: ఏకంగా షర్ట్ విప్పేసి మరీ చూపిస్తూ!

  ఫస్ట్ డే ఫస్ట్ షోకు షాకింగ్ టాక్

  ఫస్ట్ డే ఫస్ట్ షోకు షాకింగ్ టాక్


  శ్రీకాంత్ రెడ్డి - సంచిత జంటగా నటించిన 'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ కామెడీ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇది బాగుందని కొందరు అంటుండగా.. ఏవరేజ్ అని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు.

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ అలా

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ అలా

  'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం, ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లేందుకు కొంత టైమ్ తీసుకున్నారట. అయితే, ఇంటర్వెల్ ముందు సన్నివేశాలు బాగుంటాయని తెలిసింది. కానీ, సెకెండాఫ్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదని అంటున్నారు. ఇక, క్లైమాక్స్ మాత్రం కొత్తగా లేకపోవడంతో తేలిపోయినట్లు ఉంటుందట.

  శృతి మించిన సీరియల్ నటి హాట్ షో: ఇలాంటి ఫొటోలు ఎప్పుడూ చూసుండరు!

  సినిమా ప్లస్‌లు.. మైనస్‌ ఇలా

  సినిమా ప్లస్‌లు.. మైనస్‌ ఇలా

  'ఫస్ట్ డే ఫస్ట షో' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. కొన్ని సన్నివేశాలు, నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ మాత్రమే ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. అలాగే, అనుదీప్ కేవీ ఇచ్చిన కథ కొత్తగా లేకపోవడంతో పాటు నెమ్మదించిన స్క్రీన్‌ప్లే, లీడ్ పెయిర్ మధ్య లవ్ ట్రాక్, పాటలు అంతగా ఆకట్టుకోకపోవడం ఈ చిత్రానికి మైనస్‌గా మారాయని చెబుతున్నారు.

  మొత్తంగా సినిమా ఎలా ఉంది

  మొత్తంగా సినిమా ఎలా ఉంది

  ట్విట్టర్ ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల కోసం హీరో పడే తాపత్రయంతో సాగే కామెడీ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకునేలా లేదని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అయితే, కామెడీ చిత్రాలను ఇష్టపడే వాళ్లు మాత్రం ఒకసారి చూడొచ్చని సినిమాను చూసిన వాళ్లు చెప్తున్నారు.

  Sara Ali Khan: స్టార్ క్రికెటర్‌తో హీరోయిన్ డేటింగ్.. నైట్ ఇద్దరూ కలిసి అలా కనిపించడంతో!

  ఏది ప్లస్సో అదే మైనస్ అంటూ

  ఏది ప్లస్సో అదే మైనస్ అంటూ

  ఇక, 'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీని చూసిన వాళ్లు చెబుతున్న దాని ప్రకారం.. ఈ సినిమాను కామెడీ ప్రధానంగా తెరకెక్కించారు. కానీ, అదే కామెడీ దీనికి మైనస్‌గా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బలవంతంగా నవ్వించే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇది థియేటర్లలో కంటే ఓటీటీ చూడదగ్గ సినిమా అని మరికొందరు అంటున్నారు.

  English summary
  Srikanth N Reddy and Sanchita Bashu Did First Day First Show Movie Under Vamshidhar Goud, Lakshminarayana Puttamchetty Direction. Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X