వెండితెరపై తొలి, భిన్న కలయికలు-మరి రిజల్ట్ ఏమిటో?
ఒక యాక్షన్ ఇమేజ్ ఉన్నహీరో...ఫ్యామిలీ సినిమాలు తీసే దర్శకుడితో కలిస్తే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో? ఊహించడం కొంత కష్టమే. యూత్ ఫుల్ హీరో, యూత్ ఫుల్ కథలకు దూరంగా ఉండే దర్శకుడితో సినిమా తీస్తే...సినిమా ఆడుద్దా? దొబ్బేస్తుందా? అని అంచనా వేయడం కూడా అసాధ్యమే. మరి అలాంటి భిన్న కలయికలు ఇటీవల టాలీవుడ్ లో చాలా చోటు చేసుకున్నాయి. అవేమిటో పరిశీలిద్దాం...
పవన్ కళ్యాణ్-సింగితం శ్రీనివాస్ దర్శకత్వంలో 'జీసస్" సినిమా తెరకెక్క బోతోంది. భిన్న ధృవాళ్లా ఉండే వీళ్ల ఇద్దరి కలయిక ఆసక్తి కలిగిస్తోంది. యువతరం నచ్చే కథలంటే మక్కువ చూపించే తత్వం ఎన్న వ్యక్తి పవన్ అయితే...అందుకు పూర్తి భిన్నమై వ్యక్తి సింగితం శ్రీనివాస్. గోపీచంద్ యాక్షన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి అయితే...దర్శకుడు కృష్ణ వంశీ అందుకు భిన్నంగా ఉమ్మడి కుటుంబం, వివాహ బంధం లాంటి కథాంశంతో ' మొగుడు" సినిమా తీస్తున్నారు. యాక్షన్, మాస్ మసాలా అంటూ ఇంత కాలం సాగిన యువహీరో రామ్ సున్నితమైన ప్రేమ కథలు తీసే కరుణాకరన్ దర్శకత్వంలో 'ఎందుకంటే ప్రేమంట" సినిమా చేస్తున్నాడు. మరి ఈ భిన్న మైన ధోరణులు ఉన్న ఈ హీరోలు, దర్శకుల కాంబినేషన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో? వేచి చూడాలి.
మరి కొందరు స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు తొలిసారి కలుస్తుండటం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలయ్యతో దర్శకుడు బాపు 'శ్రీరామ రాజ్యం", శ్రీనువైట్లతో మహేష్ బాబు 'దూకుడు" సినిమాలు చేస్తుండగా బోయపాటి-ఎన్టీఆర్ కాబినేషన్ లో ఓ సినిమా, అల్లు అర్జున్-త్రివిక్రమ్, వివివినాయక్-రాంచరణ్ కాంబినేషన్‌లో సినిమాలు వస్తున్నాయి.
వీళ్లందరివీ తొలి కలయికలు కావడం, వీరిలో కొందరు దర్శకులు, హీరోలు భిన్నమైన నేపథ్యం ఉన్నవారు కావడంతో సినీ ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











