ఆయన చేసిన తర్వాతే నన్ను చేయమంటారు: ప్రియమణి..!
రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే మొట్టమొదటిది 'నిజానికి ప్రాధాన్యమున్న సినిమాలు'తీస్తారని,రామ్ గోపాల్ వర్మ చాలా కాలం తర్వాత తెలుగులో తీస్తున్నారు. ప్రస్తుతం తీస్తున్న సినిమా 'రక్త చరిత్ర'. ఈ సినిమా లో 'ప్రియమణి 'హీరోయిన్ గా చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ గారితో మీ అను బంధం ఎలాంటిది అని అడగగా ఈ అమ్మడు ఓ తెగ పోగిడేస్తుంది. ఈ సినిమా లో హీరోలుగా 'సూర్య', హాలీవుడ్ హొమిలీ మ్యాన్ 'వివేక్ ఒబెరాయ్' లు నటిస్తున్నారు. ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ 'పరిటాల రవి జీవితచరిత్ర 'ఆధారంగా రూపోందిస్తున్నారు.
రామ్ సార్ డైరెక్షన్ లో సినిమా చేయడం చాలా తేలిక. ఆయన చేసిన సినిమాలన్ని వాస్తవానికి ప్రాధాన్యమున్న సినిమాలు తీస్తారని, నాటకీయతను అస్సలు ఇష్టపడరని, సినిమా లో 'నిజంగా అలాంటి సంఘటనే నీకు ఎదురైతే నవ్వేలా ఎదుర్కుంటావో అలాగే చెయ్యి' అంతేకాని నటించోద్దు అంటారు. ఒకటికి రెండు సార్లు మన చేత చేయించుకుంటారని, రాని పక్షంలో ఆయనే అలా కాదు ఇలా అని చూపిస్తారు. అందులో నేను చేసిన సన్నివేశాలు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. రేపు ప్రేక్షకులకు కూడా అదే అనుభూతి కలుగుతుంది అని తన మనోభావాలను వివరించారు ప్రయమణి.


Click it and Unblock the Notifications











