చెప్పేశారు: బన్నీ 'ఫస్ట్ ఇంపాక్ట్'తో వస్తున్నాడట.. ఏమై ఉంటుంది?

మెగా కాంపౌండ్ నుంచే వచ్చినప్పటికీ.. తనదైన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్. డీజే తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా 'నా పేరు సూర్య నా అల్లుడు ఇండియా'.

దర్శకుడిగా వక్కంతం వంశీకి ఇదే తొలి సినిమా కావడంతో బన్నీని ఆయన ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. సినిమాకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి ప్రచార చిత్రాలు విడుదల కాలేదు. సినిమా ఫస్ట్ లుక్‌పై ఇప్పటిదాకా ఊరిస్తూ వచ్చిన చిత్ర యూనిట్.. మొత్తానికో శుభవార్త చెప్పేశారు..

ఫస్ట్ ఇంపాక్ట్:

ఫస్ట్ ఇంపాక్ట్:

కొత్త సంవత్సర కానుకగా 1 జనవరి 2018న 'నా పేరు సూర్య నా అల్లుడు ఇండియా' సినిమాకు సంబంధించి ఫస్ట్ ఇంపాక్ట్ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత శిరీషా శ్రీధర్ ప్రకటించారు. అయితే ఆ ఇంపాక్ట్ ఏంటనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంచారు.

ఎక్కడా రాజీ పడకుండా:

ఎక్కడా రాజీ పడకుండా:

ఈ సందర్భంగా చిత్ర విశేషాలను శిరీషా శ్రీధర్ మీడియాకు వెల్లడించారు. అత్యంత భారీ తారాగాణం, సాంకేతిక నిపుణుల‌తో ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2018 ఏప్రిల్ 27న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నట్లు చెప్పారు.

హై వోల్టేజ్ సినిమా:

హై వోల్టేజ్ సినిమా:

'నా పేరు సూర్య నా అల్లుడు ఇండియా'కు నటుడు నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 'ఫస్ట్ ఇంపాక్ట్' ప్రకటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బన్నీ కెరీర్‌లో ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు తెలిపారు.

పండగ చేసుకుంటారు:

పండగ చేసుకుంటారు:

దర్శకుడు వక్కంతం వంశీ అద్భుతమైన కథ కథనంతో కంప్లీట్ ప్యాకేజీ అందిస్తున్నాడని నాగబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి.. జనవరి 1న ఫస్ట్ ఇంపాక్ట్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఫస్ట్ ఇంపాక్ట్ తో అభిమానులు పండుగ చేసుకోవడం ఖాయం అంటున్నారు.

ఔట్&ఔట్ కమర్షియల్:

ఔట్&ఔట్ కమర్షియల్:

ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న బన్నీ వాసు మాట్లాడుతూ.. ఏప్రిల్ 27, 2018న అల్లు అర్జున్ అభిమానులకు పెద్ద పండగ అన్నారు. దాని కన్నా ముందే ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో న్యూ ఇయర్ గిఫ్ట్ అందిస్తున్నామని చెప్పారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఔట్&ఔట్ కమర్షియల్ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.

సినిమా విశేషాలు:

సినిమా విశేషాలు:

కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అను ఇమ్యున‌ల్ హీరోయిన్. యాక్షన్ కింగ్ అర్జున్ , శ‌ర‌త్ కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ -శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X