చంద్రముఖి దర్శకుడితో ఐశ్వర్యరాయ్ రీఎంట్రీ (ఫస్ట్ లుక్)
హైదరాబాద్: ఎట్టకేలకు బాలీవుడ్ అందాల సుందరి ఐశ్వర్యరాయ్ రీఎంట్రీ సినిమా ఖరారైంది. చంద్రముఖి చిత్ర దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్ నటించబోతోంది. తెలుగు, తమిళం, హిందీలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. బిడ్డపుట్టినప్పటి నుండి సినిమాలకు దూరమైన ఐశ్వర్యరాయ్ మళ్లీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందనే విషయమై ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది శుభవార్తే.
ఈ మూవీ ప్రాజెక్టు వివరాలను దర్శకుడు పి.వాసు స్వయంగా ప్రకటించారు. తాను చెప్పిన కథతో ఐశ్వర్యరాయ్ ఇంప్రెస్ అయ్యారని, తమ చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ పవర్ ఫుల్ రోల్ పోషించబోతోందని, కలరి యుద్ధ విద్య ప్రదర్శించే పోరాటయోధురాలిగా ఆమె కనిపించబోతోందని, ఇందుకోసం ఐశ్వర్యరాయ్‌కి ప్రత్యేకంగా కలరి యుద్ధ విద్యలో శిక్షణ ఇప్పించనున్నట్లు పి.వాసు తెలిపారు.
దాదాపు రెండేళ్ల క్రితమే దర్శకుడు పి.వాసు ఈ చిత్రానికి సంబంధించిన కథను రెడీ చేసుకున్నారు. ఈ సినిమా కోసం ఆయన ఇప్పటికే వరల్డ్ క్లాస్ యానిమేషన్ కంపెనీలను సంప్రదించారు. ఇప్పటికే బ్యాగ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా రావడం కోసం ఫ్రాన్స్ నుండి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులను పిలిపించారు. ఈ సినిమా షూటింగ్ ఉత్తర భారతదేశంలోని లొకేషన్లతో పాటు కొలంబియాలో నిర్వహించనున్నారు.

ఐశ్వర్యరాయ్ మూవీ ఫస్ట్ లుక్
పి.వాసు దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్ నటించబోయే సినిమా ఫస్ట్ లుక్ ఇదే. ఈ చిత్రం ద్వారా ఐశ్వర్యరాయ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

తెలుగు, తమిళం, హిందీలో...
ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీలలో త్రిబాషా చిత్రంగా తెరకెక్కబోతోంది. గ్లోబల్ వన్ స్టూడియోస్ బ్యానర్‌పై కె. రమేష్ నిర్మించనున్నారు.

పి.వాసు
పి.వాసు ఇప్పటి వరకు 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి చిత్రం భారీ విజయం సాధించింది. హిందీలో ఆయన హోగీ ప్యార్ కి జీత్ చిత్రానికి దర్శకత్వం వహించారు.

మణిరత్నం తర్వాతి చిత్రంలో ఐశ్వర్యరాయ్?
మణిరత్నం దర్శకత్వంలో రాబోయే తర్వాతి చిత్రంలో కూడా ఐశ్వర్యారాయ్‌ని తీసుకున్నట్లు, తెలుగు, తమిళంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఐశ్వర్యరాయ్
మణిరత్నం దర్శకత్వంలో వచ్చే సినిమాలో ఐశ్వర్యరాయ్ నాగార్జున, మహేష్, బాబు, శృతి హాసన్‌లతో కలిసి నటించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











