అక్షయ్ కుమార్ ‘ప్యాడ్ మ్యాన్’ ఫస్ట్ లుక్ ఇదే...
అక్షయ్ కుమార్ ‘ప్యాడ్ మ్యాన్’ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు.
సాధారణంగా అగ్రహీరోలు తమ ఇమేజ్‌ను పక్కన పెట్టి ప్రయోగాత్మక, సందేశాత్మక చిత్రాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. టాయిలెట్లు, శానిటరీ నాప్కిన్ల కథాంశాలతో సినిమా అంటే ఆమడదూరం పారిపోతారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం అందుకు భిన్నం.
ఇప్పటికే స్వచ్ఛ భారత్ ఇన్స్‌స్పిరేషన్‌తో 'టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా' చిత్రం చేసిన ఆయన.... తాజాగా మహిళలు వాడే శానిటరీ నాప్కిన్ల అంశంపై సినిమా చేస్తున్నారు. 'ప్యాడ్ మ్యాన్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజైంది.

అతి తక్కువ ధర కలిగిన సానిటరీ ప్యాడ్ మేకింగ్ యంత్రం ఆవిష్కర్త అరుణాచలం మురుగనంతం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ప్యాడ్ మాన్. అక్షయ్ కుమార్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ బాల్కీ దర్శకత్వం వహిస్తున్నారు.
అక్షయ్‌కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఈ సినిమాతో నిర్మాతగా మారింది. మార్చి 14న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా, 2018 ఏప్రిల్ 13న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











