వింతగా.. అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ ఫస్ట్‌లుక్

By Bojja Kumar

హైదరాబాద్: అల్లరి నరేష్, వైభవ్, రాజుసుందరం, కిక్‌ శ్యామ్ ప్రధాన పాత్రదారులుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ వింతగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

ఇతర వివరాల్లోకి వెళితే... ఈ సినిమా విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోంది. ఈ చిత్రం విశాఖ ఏరియాకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 'గాయత్రి దేవి ఫిల్మ్స్' సంస్థ రూ. 1 కోటి చెల్లించి దక్కించుకున్నట్లు సమాచారం. వైజాగ్ ఏరియాలో అల్లరి నరేష్ సినిమాకు ఈ రేంజిలో రేటు రావడం ఇదే తొలిసారి. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఫైనల్ స్టేజీకి చేరుకుంది. సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

దర్శకుడు అనిల్ ఈచిత్రం గురించి చెబుతూ... తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రం రెండు నెటివిటీలకు దగ్గరగా ఉంటుందని, వేర్వేరుగా చిత్రీకరిస్తున్నామన్నారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ... సరికొత్త 3డి వెర్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమ యూనిట్‌కు మంచి పేరు తీసుకువచ్చేలా ఉంటుందని తెలిపారు. తండ్రీతనయులు బప్పా, బప్పీలహరి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం ఓ విశేషం. రీరికార్డింగ్‌తో పాటు తమన్‌ ఓ పాటకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా సర్వేష్ మురారి. 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X