ట్రాక్ మార్చేసిన అల్లరోడు.. ఈ అవతారం చూస్తుంటే!
అల్లరి నరేష్.. కామెడీ హీరోగా టాలీవుడ్ చిత్రసీమలో సరికొత్త హీరోయిజం చూపించాడు. గతంలో చాలామంది కామెడీ హీరోలుగా చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఫాలోయింగ్ పెంచుకున్నాడు. హీరో రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ సినిమాలనే తీస్తూ మినిమం గ్యారెంటీ హీరో అని పేరు తెచ్చుకున్న ఈ అల్లరోడు ఇప్పుడు ట్రాక్ చేంజ్ చేశాడు.
ఇటీవలి కాలంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన అల్లరి నరేష్.. ఇటీవల సూపర్‌స్టార్ మహేష్ హీరోగా వచ్చిన 'మహర్షి' సినిమాతో మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఇకపై ఇలా ప్రత్యేక పాత్రలు చేయాలని భావించాడో లేక ట్రాక్ మార్చేసి తనలో ఈ టాలెంట్ కూడా ఉందని నిరూపించాలని ప్రయత్నిస్తున్నాడో తెలియదు కానీ.. త్వరలో ఓ విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు.

జెట్ స్పీడుతో 50 సినిమాలు పూర్తి చేసిన ఈ యంగ్ హీరో సతీష్ వేగేశ్న నిర్మాణంలో కొత్త సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. విజయ్ కనకమేడల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ నెల 20వ తేదీన హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుగనుందని చిత్రబృందం ప్రకటించింది.
ఈ మేరకు చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో మొహం నిండా గాయాలతో అల్లరి నరేష్ సరికొత్తగా కనిపించాడు. ఈ అవతారం అల్లరోడిని చూస్తుంటే ఈ సినిమా ఎంత విభిన్నంగా ఉండనుందో తెలిసిపోతోంది.


Click it and Unblock the Notifications











