పెళ్లి తర్వాత అమలా పాల్ షాకింగ్ లుక్.... (ఫోటో)
హైదరాబాద్: హీరోయిన్ అమలా పాల్ పెళ్లికి ముందు పలు చిత్రాల్లో నటించి తన అందచందాలతో ఆకట్టుకుంది. అయితే పెళ్లి తర్వాత ఆమె లుక్ చూసిన అభిమానులంతా షాకయ్యారు. ఆమె లుక్ అంటే రియల్ లుక్ కాదులెండి...పెళ్లి తర్వాత ఆమె చేస్తున్న తొలి సినిమా లుక్. ఇందులో ఆమె గ్లామర్ కు ప్రాధాన్యం లేని డీగ్లామరస్ లుక్ లో కనిపించబోతోంది.
మలయాళ చిత్రం ‘మిల్లీ'తో వెండితెరపై సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతుంది. రాజేష్ పిళ్లై దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్ డీగ్లామర్ పాత్రను పోషించనుంది. పాత్రలో సహజత్వం కోసం మేకప్ లేకుండా ఈ చిత్రంలో నటించబోతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది.

సినిమా కథాంశం విషయానికొస్తే....అందవిహీనంగా ఉన్నాననే భావనతో అసంతృప్తికరమైన జీవనాన్ని కొనసాగిస్తున్న ఓ మధ్యతరగతి యువతి ఎలా అందాలరాణిగా మారింది? తన జీవితాన్ని ఏ విధంగా ఆనందమయం చేసుకుంది? అనేది మెయిన్ స్టోరీ. ఇందులో ఆమెు పాత్ర విభిన్నంగా, ఆదర్శవంతంగా ఉంటుందని అంటున్నారుజ
పెళ్లి తర్వాత సినిమాలకు కొంత విరామం ప్రకటించింది అమలాపాల్. ఆమె నటించిన చివరి సినిమా వేలైఇల్లా పట్టాధారి విడుదలై దాదాపు ఆరు నెలలయింది. దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిందనే అంతా అనుకున్నారు. ఆ మధ్య ఆమె తల్లికాబోతున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.


Click it and Unblock the Notifications











