కమల్ రెండో కూతురు తక్కువదేం కాదు(ఫొటో)

By Srikanya

ముంబై : అక్కకు ఏమాత్రం తీసిపోను అంటుంది చెల్లి అక్షర హాసన్. కమల్, సారికల వారసత్వం కొనసాగిస్తూ ఆమె నటిగా మారిన సంగతి తెలిసిందే. ఆర్ .బాల్కీ దర్శకత్వంలో 'షమితాబ్' చేస్తోంది. ఈ చిత్రంలో 'రాంఝానా' చిత్రంలో హిందీలో అడుగుపెట్టిన రజినీకాంత్ అల్లుడు ధనుష్ కి జోడీగా కనిపించనుంది. ఈ మేరకు ఈ చిత్రానికి సంభందించిన ఆమె ఫస్ట్ లుక్ బయిటకు వచ్చింది. అయితే ఇది అఫీషియల్ కాదు. షూటింగ్ లొకేషన్ లో ఉన్నవారు తీసి అప్ లోడ్ చేసింది. 'షమితాబ్'కు ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పీసీ శ్రీరామ్ కెమెరాను నిర్వహిస్తున్నారు.

తొలి చిత్రంలోనే అమితాబ్ కీలకమైన పాత్రలో చేస్తున్న చిత్రం చేస్తూండటంతో ఆమె చాలా సంతోషంగా ఉంది. చీనీ కమ్', 'పా' సినిమాలను తెరకెక్కించిన ఆర్ బాల్కీ తాజా సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా టైటిల్ గురించి అమితాబ్ ట్వీట్‌చేశారు. "ఆర్ బాల్కీ దర్శకత్వంలో నేను నటించబోయే కొత్త సినిమాకు 'షమితాబ్' అనే పేరును ఖరారు చేశారు. 'షమితాబ్' అంటే పర్టిక్యులర్‌గా ఏ అర్థం లేదు. కానీ 'షమితాబ్' అనే టైటిల్‌ను ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది'' అని ట్వీట్ చేశారు.

First Look: Debuting Star Kid Akshara Haasan

జాతీయ నటుడు కమలహాసన్‌ది సినీ కుటుంబంగా అభివర్ణిస్తారు. ఎందుకుంటే కమల్‌ మొదలుకుని ఆయన కుటుంబంలో ఎక్కువమంది సినిమావాళ్లు కావడం గమనార్హం. కమల్‌ పెద్ద అన్నయ్య చారుహాసన్‌ గతంలో పలు చిత్రాల్లో నటించిన విషయం తెలియంది కాదు. ఇక చారుహాసన్‌ కుమార్తె అయిన సుహాసిని ప్రముఖ నటిగా వెలుగొందుతోంది. ఇక ఆమె భర్త మణిరత్నానికి దర్శకుడిగా ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో విదితమే. సుహాసిని కజిన్‌ కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఇక కమల్‌ నుంచి విడాకులు పొందిన మొదటిభార్య వాణీగణపతి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఉండేవారు.

ఆ తర్వాత ఆయన రెండోభార్య సారిక కూడా హీరోయిన్‌గా బాలీవుడ్‌ చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనతో సహజీవనం చేస్తున్న గౌతమి కూడా నటి. ఇప్పుడు కమల్‌ కుటుంబ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన కుమార్తె శృతిహాసన్‌ హీరోయిన్‌గా మారింది. తండ్రితో పాటు శృతిని స్ఫూర్తిగా తీసుకుని అక్షర హాసన్‌ కూడా తెరంగేట్రం చేయటంతో కమల్ చాలా ఆనందంగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X