twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో గోపీచంద్ బర్త్ డే గిఫ్ట్‌గా ఫస్ట్ లుక్ (పోస్టర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిర్చి వంటి బ్లాక్ బస్టర్ తో తొలి ప్రయత్నమే సూపర్ సక్సెస్ అందుకున్ననిర్మాతలు వంశీ కృష్ణా, ప్రమోద్ సంయుక్తంగా యువి క్రియేషన్స్ బ్యానర్‌పై గోపీచంద్ హీరోగా, రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా ప్రొడక్షన్ నెం.3 చిత్ర ప్రారంభోత్సవం సినీ ప్రముఖుల సమక్షంలో ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే.

    ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హీరో గోపీచంద్ జూన్ 12న బర్త్ డే జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర ఫస్ట్ లుక్ నిర్మాతలు విడుదల చేసారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మిర్చి చిత్రంతో ప్రారంభమైన మా యువి క్రియేషన్ష్ బ్యానర్‌పై యాక్షన్ కింగ్ గోపీచంద్ హీరోగా అత్యున్నత సాంకేతిక నిపుణులతో భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న ప్రొడక్షన్ నెం.3 చిత్ర షూటింగ్ శర వేగంగా జరుగుతోంది అన్నారు.

    First look: Gopichand new film

    జూన్ 12న బర్త్ డే జరుపుకుంటున్న మా హీరో గోపీచంద్ కు చిత్ర యూనిట్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గోపీచంద్ బర్త్ డే కానుకగా చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసాం. ఈ చిత్రం గోపీచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతోందని ధీమాగా చెబుతున్నాం. ఈ చిత్రం ద్వారా ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేసిన రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

    జూన్ 6న ప్రారంభమైన చిత్ర షూటింగ్ జూన్ 21 వరకు మొదటి షెడ్యూల్ జరుపుకుంటుంది. అన్ని కమర్షియల్ హంగులతో యాక్షన్ ఓరియెంటెడ్ గా ఈచిత్రం రూపొందిస్తున్నాం. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారని తెలిపారు. గోపీచంద్, చలపతిరావు, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, కబీర్, హరీష్, ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబీ అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు.

    ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్: తోట విజయ్ భాస్కర్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, యాక్షన్ డైరెక్టర్: అనల్ అరసు, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రపీ: శక్తి శరవణన్, మ్యూజిక్: సాగర్ మహితి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎం.అశోక్ కుమార్ రాజు, ఎన్. సందీప్, ప్రొడ్యూసర్స్: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-డైరెక్షన్-రాధాకృష్ణ కుమార్.

    English summary
    Here is the first look of Gopichand's latest film that is being produced by UV Creations. Vamsi and Pramod produce this movie in the direction of Radha Krishna Kumar. This 1st look is released on the occasion of Gopichand's birthday on 12 June.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X