'బాద్షా' ఆడియో రోజునే... 'ఇద్దరమ్మాయిలతో' స్పెషల్
మరో ప్రక్క ఈ చిత్రం విడుదల తేదీని సైతం ఖరారు చేసారు. 'ఇద్దరమ్మాయిలతో చిత్రాన్ని మే 10న విడుదల చేస్తున్నాం. బన్నీ కెరీర్లోనే నెం.1 చిత్రం అవుతుంది. ఈ చిత్రం తీస్తున్న పూరి అన్నయ్యకు థాంక్స్' అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేసారు. శర వేగంగా సాగుతున్న ఈచిత్రం ప్రస్తుతం స్పెయిన్లో షూటింగ్ జరుపుకుంటోంది. స్పెయిన్ దేశంలో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరించనున్నారు. అల్లు అర్జున్ తొలిసారిగా ఈచిత్రంలో శరీరంపై టాటూలు వేసుకుని కనిపించనున్నాడు.
సినిమా స్టోరీలైన్ విషయానికొస్తే....ఒకే కుర్రాడు ఇద్దరమ్మాయిలతో ప్రేమలో పడి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని టాక్. 'ఇడియట్', 'దేశముదురు' తరవాత ఓ పూర్తిస్థాయి ప్రేమ కథని తెరపై చూపిస్తున్నారు పూరి. అదే విధంగా ఈచిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయి. థాయ్ ఫైట్ మాస్టర్ కెచే కంపక్డీ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్ కానున్నాయి.
అల్లు అర్జున్ సరసన అమలాపాల్, కేథరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.


Click it and Unblock the Notifications












