నాని ‘అ!’...హీరోయిన్ కాజల్ లుక్ ఇదే, చెట్టు పాత్రలో రవితేజ!
యంగ్ హీరో నాని నిర్మాతగా 'అ!' అనే చిత్రం తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న ముఖ్య పాత్రలను పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్ విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న కాజల్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఈ చిత్రంలో రవితేజ చెట్టు పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. హీరో నాని చేప పాత్రకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇందులో ఇంకా నిత్యా మీనన్, రెజీనా, శ్రీనివాస్ అవసరాల కూడా నటిస్తున్నారు. త్వరలో వీరి పాత్రలకు సంబంధించిన లుక్ విడుదల కానుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కనుంది.
కాజల్ లుక్ ఇదే...
‘అ!' మూవీలో కాజల్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. అయితే ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు. త్వరలో విడుదలయ్యే టీజర్లో కాజల్ పాత్రను పరిచయం చేయనున్నారు.
చెట్టు పాత్రలో రవితేజ
‘అ!' సినిమాలోని ముఖ్య పాత్రల్లో చెట్టు పాత్ర కూడా ఒకటి. ఈ పాత్రకు రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.
చెఫ్ పాత్రలో ప్రియదర్శి
‘పెళ్లి చూపులు' ఫేం కమెడియన్ ప్రియదర్శి ఈ చిత్రంలో చెఫ్ పాత్రలో కనిపించబోతున్నారు.
మురళీ శర్మ
‘అ!' మూవీలో ప్రముఖ నటుడు మురళీ శర్మ మెజీషియన్ పాత్రలో కనిపించబోతున్నారు.
చేప పాత్రలో నాని
ఈ చిత్రానికి నాని నిర్మాతగా వ్యవహరించడంతో పాటు చేప పాత్రలో కనిపించబోతున్నాడు. చేప క్యారెక్టర్ కు నాని వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











