కళ్యాణ్ రామ్ 'పటాస్' ఫస్ట్ లుక్ (ఫొటో)
హైదరాబాద్: కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం'పటాస్'. రచయిత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే కొబ్బరికాయ కొట్టుకొన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని దర్శక,నిర్మాతలు విడుదల చేసారు. చిత్రంలో కల్యాణ్‌రామ్ పోలీసు అధికారిగా కనిపిస్తారు. ఈ ఫస్ట్ లుక్ డిఫెరెంట్ గా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇందులో హీరోయిన్ గా శ్రుతి సోధి నటిస్తోంది. పంజాబీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది శ్రుతి. అటు అందంగా కనిపించడంతోపాటు ఇటు నటనలోనూ రాణిస్తోంది. చిత్రంలో కల్యాణ్‌రామ్ పోలీసు అధికారిగా కనిపిస్తారు. కథలో మలుపులు రక్తికట్టించేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. సాయికుమార్, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కందిరీగ, ఆగడు సినిమాలకు రైటర్ గా పనిచేసిన అనిల్ రవిపూడి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పటాస్ అనేదే మాస్ టైటిల్, అలాంటి ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కళ్యాణ్ రామ్ ఫూర్తి రఫ్ లుక్ లోకనిపించనున్నారు. కళ్యాణ్ రామ్ నిర్నిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











