For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రికెటర్ ధోనీ జీవితంపై సినిమా: ఫస్ట్ లుక్ ఇదే...(ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జీవిత కథతో బాలీవుడ్ దర్శకుడు నీరజ్‌ పాండే ఓ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో. ‘ఎంఎస్ ధోని' అనే టైటిల్ తో ఉన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ధోనీ భార్య సాక్షి సింగ్ ఈ పోస్టర్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. పోస్టర్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 7వ నెంబర్ గల టీమిండియా జెర్సీ ధరించాడు. 7 నెంబర్ అనేది ధోనీకి చాలా స్పెషల్. ఎందుకంటే ధోనీ పుట్టిన రోజు 7/7/1981.

    ధోనీ రిటైర్మెంట్ తర్వాతే....

    ధోనీ సినిమాను ప్లాన్ చేసుకున్న నీరజ్ పాండే ప్రయత్నాలకు బీసీసీఐ తాత్కాలికంగా అడ్డు పడి షాక్ ఇచ్చింది. ధోని క్రికెట్‌లో కొనసాగుతున్నంత కాలం ఆయన జీవితకథతో సినిమా తీయడానికి వీల్లేదని బి.సి.సి.ఐ. తేల్చి చెప్పింది. ఆయన క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక సినిమా నిర్మిస్తే తమకేమి అభ్యంతరం లేదని ప్రకటించింది. ధోనీ ఆటపై ప్రభావం చూపుతుందనే కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

     First Look: M.S. Dhoni, Sushant Singh Grabs Captaincy

    దాదాపు 100 కోట్లతో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చిత్ర హక్కుల కోసం ధోనికి 40కోట్ల భారీ మొత్తాన్ని ముట్టజెప్పారనే వార్తలు వినిపించాయి. అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దర్శక నిర్మాతలకు మింగుడు పడటం లేదు.

    ఇటీవల క్రీడాకారుల జీవితాలపై తీసిన....‘భాగ్ మిల్ఖా భాగ్', ‘మేరీ కోమ్' లాంటి చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. దేశంలో క్రికెట్ ను అభిమానించే వారి సంఖ్యే ఎక్కువ కాబట్టి ఈ చిత్రానికి భారీ స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

    English summary
    Bollywood and Biopics have become synonymous. After Farhan Akhtar playing Milkha Singh in Bhaag Milkha Bhaag, Priyanka Chopra in Mary Kom as the olympic medal-winning boxer, now, Sushant Singh Rajput is grabbing the role of captaincy in M.S. Dhoni - The Untold Story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X