మహేష్ బాబు ఫస్ట్ లుక్ ఫోటో..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్‌లో కొనసాగుతున్న హీరో. మహేష్ బాబు అన్నా...మహేష్ బాబు సినిమాలన్నా జనాల్లో మహా క్రేజ్. అందుకే కార్పొరేట్ సంస్థలు కూడా ఆయనతో తమ వస్తువులను ప్రచారం చేయించడానికి పోటీ పడుతుంటాయి. ప్రస్తుతం మహేష్ బాబు థమ్సప్, యూనివర్శల్, ఐడియా 3జి, సంతూర్ కంపెనీలతో పాటు మరికొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. సంతూర్ సోప్ ప్రచారం కోసం మహేష్ బాబు ఇటీవల నటించిన యాడ్ ఫిల్మ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోలు బయటకు విడుదలయ్యాయి. మీరు పక్కన చూస్తున్నది అదే ఫోటో.
యాడ్స్ సంగతి పక్కన పెడితే...దూకుడు, బిజినెస్ మేన్ వరుస భారీ హిట్లతో జోరుమీద ఉన్న మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్ కూడా ఈ మూవీలో మరో హీరోగా నటిస్తున్నాడు. వెంకీ సరసన అంజలి, మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్ గా ఎంపికైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











