»   » సూపర్ స్టార్ బర్త్ డే ఫంక్షన్ లో మహేష్ దూకుడు ‘ఫస్ట్ లుక్’...!

సూపర్ స్టార్ బర్త్ డే ఫంక్షన్ లో మహేష్ దూకుడు ‘ఫస్ట్ లుక్’...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'దూకుడు" ప్రస్తుతం ప్రొగ్రెసింగ్ వర్క్ నడుస్తోంది. దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయడానికి కొంత దూకుడుగా వర్క్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా స్విట్జర్లాండ్, దుబాయ్ షూటింగ్ పూర్తిచేసుకొన్న దూకుడు నెక్స్ట్ ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుందని సమాచారం.

ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒక శుభవార్త ఏంటంటే..సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే మే 31 వతేదిన మహేష్ 'దూకుడు"కు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీసర్స్, ట్రైలర్స్ విడుదల చేయనున్నారు. 'ఖలేజా" ఫ్లాప్ తర్వాత వెంట వెంటనే సినిమాలు చేస్తానని, దూకుడును ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు తెస్తామని ప్రిన్స్ అభిమానులకు మాటిచ్చాడు. కాని సినీ పరిశ్రమలో కొనసాగిన సమ్మె, ఇతర సాంకేతిక కారణాల వల్ల అది వీలుపడలేదు. ఎట్టకేలకు ఈ చిత్రం మహేష్ జన్మదినం రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Mahesh, Samantha starrer Dookudu is progressing at a brisk pace and the makers are planning to release the film in July. The unit has recently returned back from Switzerland and Dubai schedules and the next schedule will begin shortly in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu