మణిరత్నం ‘కడల్’ ఫస్ట్ లుక్
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో 'కడల్' అనే తమిళ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సీనియర్ నటుడు కార్తీక్ కొడుకు గౌతమ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. అతనికి జంటగారాధ చిన్న కూతురు తులసి(తొలి పరిచయం) నటిస్తోంది. ఇతర ప్రధానపాత్రలో అరవింద్ స్వామి, మోహన్‌బాబు కుమారుడు లక్ష్మీప్రసన్న నటిస్తున్నారు.
తెలుగులో ఈ చిత్రం "కడలి" అనే పేరుతో విడుదల కానుంది. MTV లో విడుదల చేసిన 'నెంజికుల్లె' పాట అంతర్జాలంలో అద్భుతమయిన విజయం సాదించింది. దక్షిణ తమిళనాడులో ఒక పల్లెలో యువ జాలర్ల మధ్యన జరిగే ప్రేమకథగా ఈ చిత్రం ఉండబోతుంది.
ఈ చిత్రానికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్. రెహ్మాన్ సంగీత బాణీలు కడుతుండగా, రాజీవ్‌మీనన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. శ్రీకార్ ప్రసాద్ కూర్పు బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం మద్రాసు టాకీస్ పతాకంపై రూపొందుతున్న 14వ చిత్రం. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 23వ చిత్రం కావడం విశేషం.
జెమిని ఫిల్మ్ సర్క్కూట్ వారు ఈ చిత్రాన్ని రికార్డు స్థాయి ధర చెల్లించి థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఇందు కోసం రూ. 25 కోట్ల వరకు ఆఫర్ చేశారని తమిళ సినీ వర్గాల సమాచారం. మణిరత్నం ఈ మధ్య వరుస ప్లాపులు ఎదుర్కొంటున్నా ఈ రేంజ్‌లో ఆఫర్ రావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications












