‘ఆ రోజు రాముడు చేసింది తప్పయితే నాదీ తప్పే’ అంటున్న మోహన్ బాబు!

By Bojja Kumar

ప్రముఖ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'గాయత్రి'. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మదన్ రామిగాని ఈ చిత్రానికి దర్శకుడు. మోహన్ బాబు పవర్ ఫుల్ లుక్ తో పాటు ఈ పోస్టర్ మీద ఉన్న క్యాప్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మోహన్ బాబు మెయిన్ లీడ్‌గా చేస్తున్న 42వ చిత్రం ఇది.

 ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే...నాదీ తప్పే

ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే...నాదీ తప్పే

"ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే...నాదీ తప్పే" అంటూ సినిమాలో మోహన్ బాబు చెప్పిన డైలాగుతో ఈ పోస్టర్ విడుదల చేశారు. ఈ డైలాగ్ బట్టే ఆయన పాత్ర సినిమాలో ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

 పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి తర్వాత ఆస్థాయిలో..

పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి తర్వాత ఆస్థాయిలో..

మోహన్ బాబు కెరీర్లో పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి చిత్రాలు ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రాలు. ఆ సినిమాల స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ‘గాయిత్రి' సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

మంచు విష్ణు కూడా

మంచు విష్ణు కూడా

'గాయత్రి' చిత్రంలో విష్ణు మంచు కూడా మరో పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. విష్ణుకు జోడిగా శ్రియ నటిస్తోంది.

 ‘గాయిత్రి' అంటే ఎవరు?

‘గాయిత్రి' అంటే ఎవరు?

ఈ చిత్రంలో టైటిల్ రోల్ నిఖిలా విమల్ నటిస్తున్నారు. మోహన్ బాబు కూతురిగా ఆమె కనిపించబోతున్నారు. ‘గాయిత్రి' పాత్ర చుట్టూ సినిమా నడుస్తుందని తెలుస్తోంది.

 బ్రహ్మానందం, అనసూయ

బ్రహ్మానందం, అనసూయ

ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్ నటిస్తున్నారు. బ్రహ్మానందం అంటే సినిమాలో ఫన్ గ్యారంటీ. అనసూయ జర్నలిస్ట్‌గా నటిస్తోంది.

 రిలీజ్ డేట్ ఖరారు

రిలీజ్ డేట్ ఖరారు

ఫిబ్రవరి 9 ను విడుదల తేదీగా ఖరారు చేసిన 'గాయత్రి' చిత్రాన్ని మోహన్ బాబు తమ సొంత బేనర్ 'శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్'పై నిర్మిస్తుండగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.

 తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయాగ్రహం: సర్వేశ్ మురారి, ఆర్ట్: చిన్న, ఎడిటర్: ఎంఆర్ వర్మ, ఫైట్స్: కనల్ కణ్ణన్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య. కో-డైరెక్టర్స్: అనిల్ కుమార్, కె.వి.ఎస్.ఎన్, గుణ నాగేంద్ర ప్రసాద్, రవి బయ్యవరపు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయకుమార్.ఆర్, నిర్మాత: డా. మోహన్ బాబు యమ్, దర్శకత్వం: మదన్ రామిగాని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X