twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ బాబు 'యమలీల 2' ఫస్ట్ లుక్ (ఫోటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : మోహన్ బాబు యముడిగా నటిస్తున్న 'యమలీల 2' సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల కార్యక్రమం, నటీనటుల పరిచయ కార్యక్రమం మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.

    ఈ సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కె.వి. సతీష్‌ హీరోయిన్. దియా నికోలస్‌ హీరోయిన్. క్రిస్వీ ఫిలింస్‌ పతాకంపై సినిమా తెరకెక్కుతోంది. సినిమా ఫస్ట్‌లుక్‌ని ప్రముఖ నిర్మాత డా|| డి.రామానాయుడు ఆవిష్కరించారు.

    ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత మోహన్‌బాబుని 'పద్మశ్రీ మోహన్‌బాబు' అని సంబోధించారు. దానికి సమాధానంగా మోహన్‌బాబు మాట్లాడుతూ ''పద్మశ్రీ'ని మోహన్‌బాబు తీసుకొచ్చాడు. అంతేగానీ మోహన్‌బాబుని పద్మశ్రీ తీసుకురాలేదు. మోహన్‌బాబు మంచి నటుడు అని అనుకుంటే చాలు. ఈ బిరుదులు పెద్ద విషయం కాదు. అయినా ఇది అప్రస్తుతం.. కేసు కోర్టులో ఉంది వదిలేయండి'' అన్నారు.

    ఈ కార్యక్రమంలో చిత్రబృందంతోపాటు అచ్చిరెడ్డి, కె.రాఘవేంద్రరావు, బ్రహ్మానందం, తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, బండ్ల గణేష్‌, ఆశిష్‌ విద్యార్థి, గౌతంరాజు తదితరులు పాల్గొన్నారు.

    ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఫోటోలు స్లైడ్ షోలో...

    మోహన్ బాబు మాట్లాడుతూ...

    మోహన్ బాబు మాట్లాడుతూ...

    ''నటుడు అంటే కూలీ తీసుకొని పని చేసేవాడు. దర్శక నిర్మాతలు చెప్పినట్లు నటులు వినాలి. అలా విన్నవాళ్లు ఎక్కువ కాలం పరిశ్రమలో ఉంటారు. లేని వాళ్లకు జీవితం ఉండదు'' అన్నారు మోహన్‌బాబు.

    యముడుగా అదృష్టం..

    యముడుగా అదృష్టం..

    ''యముడి పాత్ర పోషించడం ఓ అదృష్టం. ఈ సినిమా ద్వారా నాకు రెండోసారి ఆ అదృష్టం దక్కింది. దీని తర్వాత మరోసారి యముడి పాత్ర పోషించను. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలతో పని చేస్తుంటే బాపు, రమణతో పని చేస్తున్న అనుభూతి కలిగింది. చిత్ర హీరో సతీష్‌ని చూస్తుంటే 'స్వర్గం - నరకం' సమయంలో నేను ఎలా ఉండేవాడినో గుర్తుకొస్తోంది. సతీష్‌ మంచి నటుడిగా ఎదుగుతాడు'' అన్నారు మోహన్ బాబు.

    ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ...

    ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ...

    ''యమలీల' వచ్చిన ఇరవయ్యేళ్ల తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. ప్రస్తుత సాంకేతికతతో ఈ చిత్రం కాస్త వైవిధ్యంగా ఉంటుంది. ఎన్టీఆర్‌గారి తర్వాత యముడి పాత్ర మోహన్‌బాబుగారికి బాగా నప్పింది. జీవితంలో ఎంతో కష్టపడి పైకొచ్చిన సతీష్‌కి ఈ సినిమా హీరోగా మంచి పేరు తీసుకురావాలి. నా మొదటి సినిమాలా భావించి ఈ సినిమాని రూపొందించాను'' అన్నారు.

    హీరో కేవీ సతీష్‌ మాట్లాడుతూ...

    హీరో కేవీ సతీష్‌ మాట్లాడుతూ...

    ''మా సంస్థ నుంచి విలువైన వినోదాన్ని అందించేలా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. గత 'యమలీల' అందించిన వినోదాన్ని ఇదీ అందిస్తుంది'' అన్నారు.

    టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ...

    టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ...

    ''ఎస్వీ కృష్ణారెడ్డి అంటే ఓ బ్రాండ్‌. కథను నమ్మి సినిమాలు తీసే దర్శకుడు. మోహన్‌బాబు, కేవీ సతీష్‌ అందరినీ అలరిస్తారనే నమ్మకం ఉంది'' అన్నారు.

    చిరు పాటకు...

    చిరు పాటకు...

    ఈ చిత్రంలో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్... "యమహో నీ యమా యమ అందం..." ని రీమిక్స్ చేయనున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోని ఈ సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపింది. ఇప్పుడు మళ్లీ థియోటర్స్ లో ఈ పాట రేంజిలో క్రేజ్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. దానికితోడు మోహన్ బాబు స్టెప్స్ ఏ రేంజిలో ఉంటాయో ఊహించుకోమంటున్నారు.

    అప్పట్లో...

    అప్పట్లో...

    1994లో మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం ‘యమలీల'. ఎస్వీకృష్టాడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో అందిరికి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్ రూపొందుతోంది.

    ఐటం సాంగ్ లో...

    ఐటం సాంగ్ లో...

    ఈ చిత్రంలో వచ్చే ఐటం సాంగ్ లో హీరోయిన్స్ గా సదా,నిషా కొఠారి ఎంపిక అయినట్లు సమాచారం. వీరిద్దరిపై ఓ పాటను ఈ చిత్రీకరించినట్లు సమాచారం.

    క్రేజ్...

    క్రేజ్...

    మోహన్ బాబు యమధర్మరాజు గా కనిపించనున్నారు. అదే ఈ చిత్రానికి క్రేజ్ తీసుకు వస్తోంది. ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

    బ్రహ్మానందం హంగామా

    బ్రహ్మానందం హంగామా

    బ్రహ్మానందం ఉన్నాడంటే ఇప్పుడు ఆ సినిమా హిట్టే. ఇక చిత్ర గుప్తుడుగా బ్రహ్మానందమే చేస్తున్నారు. దాంతో బిజినెస్ కు కూడా బాగా జరుగుతుందని భావిస్తున్నారు.

    ఎస్వీ మార్క్..

    ఎస్వీ మార్క్..

    ఎస్వీ కృష్ణా రెడ్డి చిత్రాలంటే ఫ్యామిలీ ప్రేక్షకులలో ఓ గుర్తింపు. క్లీన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంటాయని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లే...పూర్తి స్ధాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది.

    సీక్వెల్ కాబట్టి...

    సీక్వెల్ కాబట్టి...

    సీక్వెల్ గా ఈ చిత్రం బిజినెస్ పరంగానూ వండర్స్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాల్లో విశ్లేషిస్తున్నారు. అయితే ఎస్వీ కృష్ణారెడ్డి ఈ తరం యువత పల్స్ ని ఎంత మేరకు పట్టుకోగలుగుతాడనే విషయంపై ఈ చిత్రం విజయం ఆధారపడి ఉంటుందనేది మాత్రం నిజం.

    English summary
    
 SV Krishna Reddy who directed the original Yamaleela is also wielding the megaphone for the sequel. Mohan Babu and Nisha Kotari are playing key roles. Sada shakes her leg for the item song which would be be on the lines of chartbuster song 'Andalalo Aho…' from the blockbuster movie 'Jagadeka Veerudu Atiloka Sundari'. 'Yamaleela 2' might release in June this year!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X