జూ ఎన్టీఆర్ ‘బాద్ షా’ ఫస్ట్ లుక్
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, క్రేజీ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో 'బాద్ షా' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మే 20న జూ ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మరింత స్లిమ్‌గా ఎనర్జిటిక్ లుక్‌తో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.
బాద్ షా చిత్రం తొలి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ యూరఫ్‌లో ప్లాన్ చేశారు. ఈ మేరకు యూనిట్ సభ్యులంతా అక్కడి వెళ్లనున్నారు. రెండు నెలల పాటు అక్కడ షూటింగ్ జరుగనుంది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న 'బాద్‌షా' సినిమాకు శ్రీనువైట్ల దర్శకుడు. కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రం గురించి దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ... 'దూకుడు' లాంటి సూపర్‌హిట్ తర్వాత చేస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్ ఇమేజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఎన్టీఆర్ చిత్రమంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారో ఆ అంశాలన్నీ ఇందులో వుంటాయి. స్క్రిప్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. యాక్షన్‌తో పాటు ఇందులో ఓ అందమైన ప్రేమకథ ఉంటుందని అన్నారు.
ఈచిత్ర షూటింగులో భాగంగా ఇటలీ, నేపాల్‌లలో భారీ చేజింగ్ సీన్లు చిత్రీకరించబోతున్నారు. ఇందుకోసం హాలీవుడ్ చిత్రాలు 'టాన్స్ ఫార్మర్స్', 'హిట్ మ్యాన్' లాంటి చిత్రాలకు పని చేసిన టెక్నీషియన్స్‌ను తీసుకుంటున్నారు. ఈ సీన్లలో భారీగా విజువల్ ఎఫెక్ట్స్ జోడిస్తున్నారు.


Click it and Unblock the Notifications











