‘బాణం' దర్శకుడు 'బసంతి' చిత్రం ఫస్ట్ లుక్

ఇక 'బసంతి' చిత్రం యాక్షన్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. దర్శకుడు గత చిత్రం బాణం కి మంచి టాకే వచ్చినా...బాక్సాఫీసు వద్ద మాత్రం కలెక్షన్లు కురిపించలేక పోయింది. అయితే చైతన్యకు మాత్రం విమర్శకుల ప్రశంసలు అందాయి. గౌతమ్ ఇప్పటికే పలు చిత్రాల్లో నటించినా ఒక్కటి కూడా విజయవంతం కాలేదు. ఆయన 'పల్లకిలో పెళ్లి కూతురు', 'వారెవా' చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. అయితే'బసంతి' చిత్రం వీరిద్దరి కెరీన్ ని మలుపు తిప్పుతుందని.. గౌతమ్ కి వివాహంతో కలిసి వస్తుందని అంటున్నారు.
హాస్యనటుడు బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి చాలా ఘనంగా జరిగింది. ఆయన పెద్ద కుమారుడు గౌతమ్ వివాహం బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జ్యోత్స్నతో జరిగింది. ఈ వివాహ వేడుకు ఇండస్ట్రీలో పెద్దలంతా హాజరయ్యారు. ఈ వేడుకలో భాగంగా సంగీత్‌ను మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ సందడికి హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణం వేదికైంది. మంచు మనోజ్ వేదికపై నృత్యాలు, సరదా సంభాషణలతో అలరించారు. వధూవరులతో కలిసి మంచు లక్ష్మి, విష్ణు తదితరులు నృత్యాలు చేశారు. వీళ్లంతా కలిసి బ్రహ్మానందాన్ని వేదికపైకి తీసుకొచ్చి డ్యాన్స్ చేయించారు. ఈ వేడుకలో అల్లు అరవింద్, శిరీష్, మోహన్‌బాబు, వధువు తండ్రి శ్రీనివాస్‌రెడ్డి (ఛాయాగ్రాహకుడు) పాలుపంచుకొన్నారు.


Click it and Unblock the Notifications











