ఫస్ట్ లుక్ : 'రుద్రమదేవి' లో ప్రకాష్ రాజ్ (ఫొటో)
హైదరాబాద్ : అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'రుద్రమదేవి'. రానా ముఖ్య పాత్రధారి. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఓ కీలకమైన పాత్ర(శివ దేవయ్య) ను పోషిస్తున్నారు. ఇక ఆయన పాత్రకు సంభంధించి షూటింగ్ పూర్తైంది. దాంతో ఆయన తన గెటప్ తో ఉన్న ఫొటోను ఇలా ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసారు.
ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ... " రుద్రమదేవి చివరి రోజు. గుణశేఖర్ ప్యాశన్ మమ్మల్ని గర్వ పడేలా చేసింది. ఆయన కలలో పాలు పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది ," అన్నారు.
దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తనకే సాధ్యమైన రీతిలో ఎవరూ వంక పెట్టలేని విధంగా రూపొందించాలని గుణ శేఖర్ కష్టపడుతున్నారు. ఈ మేరకు ఖర్చు కూడా భారీగా పెడుతున్నారు.

దర్శుడు మాట్లాడుతూ... ''కాకతీయుల కాలం నాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా ఈ సెట్‌లు ఉండబోతున్నాయి. వీటి కోసం తోట తరణి 400 స్కెచ్‌లు వేశారు. నాటి సంప్రదాయలు, జీవన స్థితిగతులను ప్రతిబింబించేలా చిత్రబృందం ఎంతో శ్రమించి వీటికి రూపు తీసుకొస్తోంది. ఇప్పటికే కొన్ని సెట్‌లలో షూటింగ్ చేశాం. మిగిలిన వాటిలో త్వరలోనే చిత్రీకరణ జరుపుతాం'' అన్నారు.
వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం 'రుద్రమదేవి'. అనుష్క, రానా, కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, సుమన్, ఆదిత్య మీనన్, నిత్యా మీనన్, కేథరిన్, హంసానందిని, బాబా సెహగల్, జయప్రకాష్ రెడ్డి, అజయ్, అర్పిత్ రాంకా, వేణు మాధవ్, వెన్నెల కిషోర్, చలపతిరావు, ఆహుతి ప్రసాద్, కృష్ణ భగవాన్, ప్రభ, అదితి చెంగప్ప, సంధ్యా జనక్, అనితానాథ్, సుబ్బరాయశర్మ, సంపత్ రాజ్, జీవా, రవిప్రకాష్, వినోద్, ప్రసన్నకుమార్, టీవీ 9 హర్ష, ఈ టీవీ ప్రభాకర్, పార్థసారథి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ శివదేవయ్య పాత్రలో నటిస్తున్నాడు. రుద్రమదేవికి రాయల్ అడ్వైజర్‌గా ఈచిత్రంలో ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నాడు.
రుద్రమదేవి చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఆర్ట్: తోటతరణి, ఫోటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, కాస్ట్యూమ్ డిజైనర్ : నీతా లుల్లా, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటల: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫైట్స్: విజయ్, కాస్ట్యూమ్స్: వి.సాయిబాబు, మేకప్: రాంబాబు, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామగోపాల్, సమర్పణ: శ్రీమతి రాగిణీ గుణ, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: గుణశేఖర్.


Click it and Unblock the Notifications











