ఫస్ట్ లుక్ అదిరింది... అంతటా అదే చర్చ (ఫొటో)
ముంబై: ఇద్దరు పిల్లలకు తల్లి అయినా మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ఒలింపిక్స్ లో పాల్గొని, బాక్సింగు క్రీడలో కాంస్య పతకాన్ని సాధించిన మణిపూర్ మణిపూస మేరీ కోమ్ పాత్రను ఇప్పుడు ప్రియాంకా పోషించబోతోంది. బాక్సర్ గా ఎదిగే క్రమంలో మేరీ కోమ్ తన జీవితంలో ఎదుర్కున్న అనుభవాల నేపథ్యంలో సంజయ్ లీలాభన్సాలీ రూపొందిస్తున్న ఈ హిందీ చిత్రం షూటింగు జనవరి నుంచి మొదలవుతుంది. మేరీ జీవితం తననెంతో ఇన్స్ పైర్ చేసిందని, అందుకే ఈ పాత్ర చేయడానికి మరో ఆలోచన లేకుండా అంగీకరించాననీ ప్రియాంకా చెబుతోంది. ఒమంగ్ కుమార్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసారు. అదే మీరు చూస్తున్నది.
హిందీలో కొత్త హీరోయిన్స్ ఎంత మంది వస్తున్నా హీరోయిన్ల కొరత మాత్రం తీరట్లేదు. భారీ సినిమాలు అనేసరికి కొంతమంది ప్రముఖ నాయికల పేర్లే వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రియాంక చోప్రా హవా కొనసాగుతోంది. ఆమె కాల్షీట్ల కోసం దర్శకులు పడిగాపులు కాస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకులు సంజయ్ లీలా భన్సాలీ, అశుతోష్ గోవారికర్‌లిద్దరూ ఆమెను తమ చిత్రాల్లో నాయికగా తీసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం ప్రియాంక దృష్టంతా మేరీ కోమ్ సినిమా మీదే ఉంది. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఆమె ఒలింపిక్ విజేత, బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ పాత్రలో కనిపించబోతోంది.దీని తరవాత జోయా అఖ్తర్ దర్శకత్వంలో 'దిల్ ధడఖ్‌నే దో'లోనూ నటించేందుకు సిద్ధమైంది. వీటి తరవాతే ప్రియాంక వేరే చిత్రాలు అంగీకరించే స్థితిలో ఉంది. సంజయ్ లీలా భన్సాలీ ఎంతో కాలంగా తన కలల ప్రాజెక్టుగా చెప్పుకొంటున్న 'బాజీరావ్ మస్తానీ' సినిమాను త్వరలోనే మొదలుపెట్టాలని అనుకుంటున్నారట.
ఇందులో బాజీరావ్ భార్య కాశీబాయి పాత్రకు ప్రియాంక కచ్చితంగా సరిపోతుందని ఆయన భావిస్తున్నారట. అందుకే ఎలాగైనా ప్రియాంకను ఒప్పించి తన సినిమాలో నటింపజేయాలని ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు. అలాగే 'మొహంజోదారో' అనే చారిత్రక నేపథ్యమున్న సినిమాలో ప్రియాంకను తీసుకోవాలని అశుతోష్ యోచిస్తున్నారు. మరి ప్రియాంక ఎవరికి కాల్షీట్లు ఇస్తుందో... ఆ సినిమాలు ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











