గోపీచంద్ 'గోలీమార్' పోస్టర్.. కేక
గోపీచంద్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో రెడీ అయిన గోలీమార్ చిత్రం పోస్టర్ ని పూరీ జగన్నాధ్ తన ఫేస్ బుక్ ఎక్కౌంట్ లో పెట్టారు. ఈ పోస్టర్ చాలా కొత్తగా ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించారు నిజానికి దయానాయక్ జీవితం చాలా సినిమాటెక్ లాంటి సంఘటనలతో నిండి ఉంది. కర్నాటకలో పుట్టిన దయానాయక్ ముంబయి చేరుకుని ఓ ఉడిపి రెస్టారెంట్ లో పనిచేస్తూ చదువుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ ఎస్సై గా జాయిన్ అయి స్ట్రీట్ ఫైట్ లో ఇద్దరు గ్యాంగస్టర్స్ ని చంపటంతో అతను వెనక్కి తిరగాల్సిన అవసరం రాలేదు. ఆయన ఓపెన్ గా ఇప్పటికి ఎనభై ముగ్గురు గ్యాంగస్టర్స్ ని ఎనకౌంటర్ చేసి చంపానని చెప్తూంటారు. ఇక పూరీ గురువు రామ్ గోపాల్ వర్మ ఇంతకు ముందు ఆయన బ్యానర్ లో నిర్మించిన అబ్ తక్ చప్పన్ కూడా దయానాయక్ జీవిత సంఘటనలతో తయారైంది. దాన్ని జేడీ చక్రవర్తి తెలుగులోకి జగపతి బాబుతో సిద్దం టైటిల్ తో అనువాదం తరహాలో డైరక్ట్ చేసి అందించారు. ఇక ఈ గోలీమార్ చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా చేస్తోంది. అలాగే చక్రి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











