రామ్ చరణ్-శ్రీను వైట్ల మూవీ టైటిల్ ఇదే...(అఫీషియల్ పోస్టర్)

By Bojja Kumar

హైదరాబాద్: రామ్ చరణ్, శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రం టైటిల్ ఖరారు చేస్తూ రామ్ చరణ్ తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా పోస్టర్ విడుదల చేసారు. ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. సినిమాలో రామ్ చరణ్ తన చేతిపై బ్రూస్ లీ టాటూతో కనిపించనున్నారు.

 First Look: Ram Charan-Sreenu Vaitla's Film Titled As Bruce Lee

ఈ చిత్రంలో చిరంజీవి కూడా గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీను వైట్ల అఫీషియల్ గా ఆ మధ్య తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రామ్ చరణ్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ‘బ్రూస్ లీ'. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా క్లైమాక్స్ ని చిత్రీకరించినట్లు సమాచారం. ఈ క్లైమాక్స్ కోసం నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించినట్లు చెప్పుకుంటున్నారు. క్లైమాక్స్ కోసం తెలుగు సినిమాలో నాలుగు కోట్లు ఖర్చు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. దాంతో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

క్లైమాక్స్ సీన్ పై అంత ఖర్చు పెట్టడాన్ని నిర్మాతని,దర్శకుడుని కొందరు అడిగితే ఇది రామ్ చరణ్ సినిమాలో క్లైమాక్స్ అందుకే అంత ఖర్చు పెడుతున్నాం. పెట్టినదానికి రెండింతలు వస్తుందని ధీమాగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ చిత్ర టీం బ్యాంకాక్ లోనూ, స్పెయిన్ లోని అందమైన లొకేషన్స్ లో రెండు పాటల షూటింగ్ ని పూర్తి చేసుకొని వచ్చారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది.

 First Look: Ram Charan-Sreenu Vaitla's Film Titled As Bruce Lee

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నారని చెప్తున్నారు. ఈ సినిమా ప్రారంభానికి ముందు స్టంట్స్‌ గురించి బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నాడు చరణ్‌. కథ రీత్యా ఈ సినిమాలో కొత్త తరహా ఫైట్లు చేయాల్సి ఉంటుందట. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X