రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ (ఫస్ట్ లుక్)
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ త్వరలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితం మీద సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ‘కిల్లింగ్ వీరప్పన్' టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసారు. వీరప్పన్‌ను చంపిన ఫోలీసాఫీర్ కథతో ఈ చిత్రం సాగుతుంది. ఆ పోలీసాఫీసర్ పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారు.

వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత మాఫియా గ్యాంగ్‌స్టర్ మర్డర్స్ లాంటివి చిన్న పిల్లల ఆటలా కనిపించాయని చెప్పిన వర్మ.... ఒసామా బిన్ లాడెన్ కన్నా శక్తిమంతుడైన వీరప్పన్ ఎంతో మంది పోలీసులను, అడవి జంతువులను చంపి తిరుగులేని క్రిమినల్‌గా అవతరించాడని తెలిపారు. అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్‌ను చంపిన పోలీస్ కథే ‘కిల్లింగ్ వీరప్పన్' సినిమా అని, ఒక ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని వర్మ ఈ సందర్భంగా తెలిపారు.
కామెడీ హారర్ నేపథ్యంలో ‘సైలెంట్' అనే మూకీ సినిమా చేస్తానని చెప్పిన రెండు రోజుల్లోనే వర్మ....‘కిల్లింగ్ వీరప్పన్' సినిమా ప్రకటించారు. కన్నడం, హిందీ, తెలుగు మరియు తమిళంలో ఈ సినిమాను విడుదల చేస్తాను అంటూ వర్మ ప్రకటించాడు. ఇప్పటికే చాలా సినిమాలు చేస్తున్న వర్మ ఈ సినిమాను ఎప్పటికి పూర్తి చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











