ఫస్ట్ లుక్ : 'శివం' గా రామ్ ... 'హరికథ' చెప్తూ... (ఫొటోలు)
హైదరాబాద్ : రామ్ హీరోగా శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ద్వారా శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి శివం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నేడు రామ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా తాలూకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. క్రింద స్లైడ్ షోలో చూడబోయోది ఇదే. ఈ మేరకు రామ్ తన అభిమానులను ఉద్దేశించి ఈ క్రింద విధంగా ట్వీట్ చేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
సురేందర్ రెడ్డి శిష్యుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శివం', సెకండ్ హ్యాండ్ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందబోయే 'హరికథ' (వర్కింగ్ టైటిల్) చిత్రాల షూటింగులను ఏకకాలంలో పూర్తి చేయడానికి ప్లాన్ చేశారు. 'శివం' ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. 'హరికథ' చిత్రీకరణ ప్రారంభిస్తారు.
స్లైడ్ షోలో...ఫొటోలు, చిత్రం విశేషాలు చూడండి

నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ ....
పూర్తిస్థాయి యాక్షన్ చిత్రమిది. ఇందులో రామ్ పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటుంది. మాస్‌తో పాటు క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలున్న చిత్రమిది. కథానుగుణంగానే టైటిల్‌ను నిర్ణయించాం. వచ్చే నెల 10వరకు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుపుతాం అన్నారు.

అందుకే...
శుక్రవారం రామ్ జన్మదినం. ఈ సందర్భంగా 'శివం' తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

క్రేజ్ ఉన్న హీరోయిన్...
రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ తెరకెక్కిస్తోంది.

షెడ్యూల్...
ఏప్రిల్ 27 నుంచి హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. జూన్ 10 వరకూ ఈ షెడ్యూలు కొనసాగుతుంది.

సంగీతం...
యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న దేవిశ్రీప్రసాద్ 'శివం'కి సంగీతం అందిస్తున్నారు.

బ్రహ్మానందం
బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, సంగీతం: దేవీశ్రీప్రసాద్, సమర్పణ: పి.కృష్ణచైతన్య.

చెలరేగిపోవటమే...
'దేవదాస్', 'రెడీ', 'మస్కా', 'కందిరీగ'... ఇలా ఏ సినిమా తీసుకొన్నా రామ్ తనదైన శైలిలో చెలరేగిపోవడమే కనిపిస్తుంది.

ఈ నెలలోనే...
ఇప్పుడు 'పండగ చేస్కో' అంటూ వినోదాలు పంచడానికి రెడీ అయిపోయాడు. ఈ చిత్రం ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











