»   » హాట్ సీన్లతో...‘రాముడు మంచి బాలుడు’ (ఫోటోస్)

హాట్ సీన్లతో...‘రాముడు మంచి బాలుడు’ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హ్యాపీడేస్, బ్రేకప్ చిత్రాల ఫేం రణధీర్ హీరోగా, గౌతమి చౌదరి హీరోయిన్‌గా పరిచయమవుతున్న చిత్రానికి 'రాముడు మంచి బాలుడు' అనే టైటిల్ ఖరారు చేసారు. టి. సత్యనారాయణ శివమనిదీప్ ప్రొడక్షన్ బేనర్లో ప్రొడక్షన్ నెం.1గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంపత్ రాజ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదల చేసారు. ఈ సందర్భంగా నిర్మాత టి. సత్యనారాయణ మాట్లాడుతూ 'మా సంస్థ శివమనిదీప్ ప్రొడక్షన్స్'లో రణధీర్, గౌతమి చౌదరిలు జంటగా, సంపత్ రాజ్ దర్శకత్వంలో పూర్తి వినోదాత్మకంగా నిర్మిస్తున్న చిత్రానికి 'రాముడు మంచి బాలుడు' అనే టైటిల్ ఖరారు చాసామని తెలిపారు.

స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన ఫోటోలు, వివరాలు...

రాముడు మంచి బాలుడు

రాముడు మంచి బాలుడు

ఈ టైటిల్ పెట్టడానికి పలు రకాలుగా ఆలోచించి మా యూనిట్ మొత్తం సలహాలు తీసుకున్నాము. కథా పరంగా కూడా పర్ పెక్టుగా ఉండటంతో దీన్నే ఖరారు చేసాము. ఈ టైటిల్ అందరికీ నచ్చుతుందని మా అందరి నమ్మకమని నిర్మాత తెలిపారు.

హీరో హీరోయిన్లు

హీరో హీరోయిన్లు


ఈ సినిమాలోని పాత్రకు రణధీర్ సరిగా సరిపోయాడు. గౌతమి అందం, అభినయంతో ఆకట్టుకుంది అన్నారు.

కమెడియన్లు

కమెడియన్లు


జబర్దస్త్ లో కడుపుబ్బా నవ్వించిన చంటి, ధనరాజ్, చిత్రం శ్రీను, షకలక శంకర్ లాంటి నటులతో ప్రముఖ నటి షకీలా కూడా నటిస్తున్నారు. ఆద్యంతం నవ్వించడానికి ఈ సినిమా చేసాము. తప్పకుండా అందరిని నవ్విస్తాము అనే నమ్మకం ఉందని నిర్మాత తెలిపారు.

దర్శకుడి గురించి

దర్శకుడి గురించి


కొత్తవాడైనా దర్శకుడు సంపత్ చాలా చక్కగా దర్శకత్వం వహించాడు. సంతోష్ కెమెరా వర్క్ బాగుంది అని తెలిపారు.

ఆగస్టులో విడుదల

ఆగస్టులో విడుదల

ఈచిత్రానికి సంబంధించిన ఆడియో త్వకలో విడుదల చేసి ఆగస్టులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ..

దర్శకుడు మాట్లాడుతూ..


సినిమా గురించి దర్శకుడు సంపత్ మాట్లాడుతూ ‘రాముడు మంచి బాలుడు' వినోదాత్మకంగా సాగుతుందని అన్నారు.

హీరో మాట్లాడుతూ....

హీరో మాట్లాడుతూ....


హీరో రణధీర్ మాట్లాడుతూ...‘బ్రేకప్ సినిమా తరువాత నేను చేస్తున్న ఈ సినిమాకి ‘రాముడు మంచి బాలుడు' అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో కూడా నా పాత్ర అలానే ఉంటుంది. కృష్ణుడుగా ఉన్న ఓ కుర్రాడు ఎలా రాముడుగా మారాడు అనేది సినిమా కథాంశమని తెలిపారు.

నటీనటులు

నటీనటులు


ఈ చిత్రంలో రణధీర్, గౌతమి చౌదరి, చంటి, ధనరాజ్, చిత్రం శ్రీను, షకీలా, శంకర్ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి మాటలు-పాటలు: భాషశ్రీ, కెమెరామెన్: సంతోష్ శానినేని, సంగీతం: నవనీత్ చారి, ఎడిటింగ్: టి.సాయి బాబు, డాన్స్: భాను, ఫైట్స్: రామ సుంకర్, ఆర్ట్: గోవింద్, పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను, స్టిల్స్: మణి, మేనేజర్: సుబ్బు, నిర్మాత: టి. సత్యానారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంపత్ రాజ్.

English summary
‘Happy Days’ fame Ranadheer and new introduction Gautami Chowdary’s upcoming movie Ramudu Manchi Baludu’s first look has been launched by the movie unit now. T. Satyanarayana is producing the movie in Siva Mani Deep Production Banner under Production No 1. Smapath Raj is introduced as debut director for this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu