వెంకీపై రాణా డామినేషన్ (డిపార్టుమెంట్ ఫస్ట్ లుక్)
ఘర్షణ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా వెంకటేష్ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. అందులో వెంకీ ఆటిట్యూడ్, స్టైల్, యాక్షన్ అన్నీ అదుర్స్. తాజాగా వెంకీ బాబాయ్ ని డామినేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు దగ్గుబాటి రాణా. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో బాలీవుడ్ లో రూపొందుతున్న డిపార్ట్ మెంట్ చిత్రంలో రాణా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి స్టిల్స్ ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు రాణా. ఈ ఫోటోలు చూస్తుంటే ఘర్షణ సినిమాలో వెంకీని మించి పోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.
'లీడర్' తర్వాత దగ్గుబాటి రాణా హిందీలో చేసిన 'దం మారో దం', తెలుగులో చేసిన 'నేను-నా రాక్షసి' రెండు సినిమాలు కూడా అపజయాల పాలయ్యాయి. ప్రస్తుతం తెలుగులో ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో జెనీలియా కాంబినేషన్లో 'నా ఇష్టం' , హిందీలో డిపార్టు మెంటు సినిమా చేస్తున్నాడు. ఈ సారైనా హిట్ సాధించి కెరీయర్లో మరింత ఎదగాలని చాలా కష్టపడుతున్నాడు ఈ దగ్గుబాటి వారి అబ్బాయి.


Click it and Unblock the Notifications











