వర్మ ‘వంగవీటి రంగా’ ఇతనే(ఫొటోలు)
హైదరాబాద్: ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా మరోసారి రంగా సినిమా ప్రకటనతో బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. అనంతపురం ఫ్యాక్షన్ గొడవలను ‘రక్త చరిత్ర' సినిమాగా మలిచిన వర్మ ఇప్పడు బెజవాడ రాజకీయాలను శాసించిన ఓ దివంగత నేత వంగవీటి మోహన రంగా జీవితాన్ని సినిమాగా తీసుకురానున్నారు.
ఈ నేపధ్యంలో వర్మ సినిమాలో నటించే ఆ నటుడు ఎవరు. ఎలా ఉంటాడు అనేది ఆసక్తికరమైన విషయమే. వీటికి తెరదించుతూ వర్మ...తన ట్విట్టర్ లో తన చిత్రంలో చేయనున్న నటుడు ఫొటోలు పెట్టారు. అంటే వంగవీటి మోహన్ రంగా ఫస్ట్ లుక్ అన్నమాట.
ఈ చిత్రంలో రంగా రాజకీయ ఆరంగ్రేటం మొదలు రంగా హత్యకు దారితీసిన పరిణామాలు, రంగా హత్యతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వర్మ తన సినిమాలో చూపించనున్నారని అంటున్నారు. రంగా సోదరుడు రాధాకృష్ణ హత్యతో ఈ కథ ప్రారంభమై రంగా హత్యతో ముగుస్తుందని వర్మ తెలిపారు.
ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడండి.
నా వంగవీటి రంగా
నా వంగవీటి రంగా
అసలు రంగా..
అసలు రంగా..
సిగరెట్ కాలుస్తూ..
వంగవీటి రాధా చాలా తక్కువ సార్లు తన అంతరంగీకుల మధ్య సిగరెట్లు కాల్చేవారు.
కాఫీ అంటే చాలా ఇష్టం...
వంగవీటి రాధా గారికి కాఫీ అంటే చాలా ఇష్టం
నిజమైన కాపులు అంటూ..
కమ్మవాళ్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తెలివి ఉన్నవాళ్లే అర్హత ఉన్న నిజమైన కాపులని చెప్పారు

వార్నింగ్ లు..
వర్మకు వార్నింగ్ లు కొత్తేమీ కాదు. రీసెంట్ గా ఆయన వంగవీటి టైటిల్ తో ఎనౌన్స్ చేసినప్పటినుంచి వార్నింగ్ లు మొదలయ్యాయి.

సంప్రదించలేదు..
విజయవాడకు చెందిన పొలిటికల్ లీడర్ వంగవీటి రాధా...ఇప్పటివరకూ తనను కానీ, తన ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ ఈ సినిమా విషయమై వర్మ సంప్రదించలేదన్నారు.

సీరియస్ గా వార్నింగ్
తన తండ్రి పేరుతో తీసే సినిమాలో ఏదైనా తేడా వస్తే మాత్రం పరిణామాలకు తాను భాధ్యత కాదన్నట్లుగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

బురదచల్లద్దు
రాధా మాట్లాడుతూ... సినిమాలో ఉన్నదున్నట్లు వాస్తవాన్ని చూపితే తమకు ఏ అభ్యంతరం లేదని అన్నారు. అంతే తప్ప రంగా జీవితంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఆయన కుమారుడుగా తానెలా స్పందిస్తానో, తనకంటే రంగా అభిమానులే ఎక్కువ స్పందిస్తారని అన్నారు.

అదే అనుమానం..
ఇక వర్మ పక్షపాత ధోరణితో వ్యవహరించి సినిమాలు ఎలా తీస్తారో తనకు తెలుసు అని అన్నారు. ఏదో ఒక వర్గం వైపుకు మ్రొగ్గు చూపే సినిమా పూర్తి చేస్తారని అనుమానం వ్యక్తం చేసారు.

ఫ్యాన్స్ బుద్ది చెప్తారు
అలాగే తన ఇంటిపేరుతో సినిమాలు తీసి, అందులో ఇష్టం వచ్చినట్లు చూపితే మాత్రం రంగా అభిమానులే బుద్ది చెప్తారని అన్నారు. ఆ సమయంలో తనకు ఎలాంటి భాధ్యతా లేదని, అవన్నీ దృష్టిలో పెట్టుకునే వర్మ సినిమా తీయాలని తేల్చి చెప్పారు.

బిజినెస్ వైజ్
కిల్లింగ్ వీరప్పన్ తర్వాత వర్మ జోరు పెంచాడు. మరో వాస్తవిక కథను తెరకెక్కిస్తున్నాడు. వివాదాస్పద అంశంలో చేయి పెడుతున్నాడు. బెజవాడలో అందరికీ తెలిసిన నాయకుడు వంగవీటి రంగా జీవిత కథను సినిమాగా మలవటం బిజినెస్ పరంగానూ ప్లస్ అవుతుంది.


Click it and Unblock the Notifications











