»   » షకీలా పోర్న్ స్టార్ కాదు: బయోపిక్ ఫస్ట్ లుక్ షేర్ చేసిన హీరోయిన్!

షకీలా పోర్న్ స్టార్ కాదు: బయోపిక్ ఫస్ట్ లుక్ షేర్ చేసిన హీరోయిన్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    90వ దశకంలో అడల్ట్ సినిమా రంగంలో షకీలా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. మలయాళం బాక్సాఫీసు వద్ద టాప్ హీరోలను సైతం వెనక్కి నెట్టేసి షకీలా సినిమాల హవా కొనసాగిన రోజులూ ఉన్నాయి. సౌతిండియా వ్యాప్తంగా షకీలా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు లగ్జరీ జీవితం అనుభవించిన ఆమె తర్వాత అన్నీ కోల్పోయారు.

    షకీలా జీవితం ఆధారంగా ఇపుడు బాలీవుడ్లో బయోపిక్ తెరకెక్కుతోంది. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షకీలా పాత్రను రీచా చద్దా పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ విడుదల చేశారు.

    షకీలా... నాట్ ఎ పోర్న్ స్టార్

    షకీలా... నాట్ ఎ పోర్న్ స్టార్

    ‘షకీలా-నాట్ ఎ పోర్న్ స్టార్' పేరుతో పోస్టర్ విడుదల చేశారు. ఇండియాలో చాలా మందికి షకీలా మీద పోర్న్ స్టార్ అనే అభిప్రాయం ఉంది. ఈ సినిమా ద్వారా ఆమెపై పడ్డ పోర్న్ స్టార్ ఇమేజ్ తుడిచేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఆమె జీవితంలోని ముఖ్య అంశాలు

    ఆమె జీవితంలోని ముఖ్య అంశాలు

    ఈ బయోపిక్ మూవీలో షకీలా జీవితంలోని ముఖ్య ఘట్టాలు చూపించబోతున్నారు. ఆమె అడల్ట్ సినిమా రంగం వైపు ఎలా వెళ్లారు? ఆ రంగంలో అంత పెద్ద స్టార్‌గా ఎదగడానికి కారణమైన అంశాలేమిటి? అనేది ఇందులో చూపించబోతున్నారు.

    కష్టాలు, అవమానాలు సైతం

    కష్టాలు, అవమానాలు సైతం

    షకీలా తన జీవితంలో పడ్డ కష్టాలు, అవమానాలు సైతం ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ముఖ్యంగా ఆమె కుటుంబ నేపథ్యానికి సంబంధించి పలు షాకింగ్ విషయాలు ఇందులో ఫోకస్ చేయబోతున్నారట.

    సూపర్ స్టార్ పాత్రలో, ప్రియుడి పాత్రలో

    సూపర్ స్టార్ పాత్రలో, ప్రియుడి పాత్రలో

    ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, రాజీవ్ పిల్లై ముఖ్య పాత్రల్లో కనిపించబనున్నారు. సౌత్ సూపర్ స్టార్ పాత్రలో పంకజ్, రాజీవ్... షకీలా ప్రియుడి పాత్రలో కనిపించబోతున్నారు.

    ఆమె జీవితంలోని ఎత్తు పల్లాలు

    ఆమె జీవితంలోని ఎత్తు పల్లాలు

    నాకు 2003లో ఓ సినిమాలో పని చేసే వరకు షకీలా గురించి తెలియదు. తెలిసిన తర్వాత ఆమె జీవితంపై సినిమా తీయాలనిపించింది. తన జీవితంలో షకీలా లగ్జరీ లైఫ్ అనుభవించారు. తర్వాత అన్నీ కోల్పోయారు. అసలు ఆమె జీవతంలో ఏం జరిగింది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నాం అని దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ తెలిపారు.

    English summary
    The makers of Shakeela biopic released the first look of the film with the tagline, 'Not a porn star'. Her films that graced the screens in the 90s were popularly known as soft porn and many labelled her as a porn star. Actress Richa Chadha has been roped in to play the titular role and Shakeela will be playing a cameo role in her biopic. According to the makers, Shakeela met Richa and the rest of the team to give them necessary inputs about her life.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more