ఫస్ట్ లుక్: కొడుకుతో శిల్పా శెట్టి
హైదరాబాద్: హీరోయిన్ శిల్పా శెట్టి మే 21, 2012న మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఇంటికే పరిమితమైన శిల్పా శెట్టి తొలిసారిగా తన కొడుకు 'వియాన్'తో కలిసి మీడియా ఫోటోగ్రాఫర్లకు చిక్కింది. శుక్రవారం జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి శిల్పా శెట్టి దర్శనం ఇచ్చింది. అయితే తన కొడుకు ఫేస్ మీడియాకు కనిపించకుండా శిల్పాశెట్టి జాగ్రత్త పడటం గమనార్హం.
గతంలో శిల్పా శెట్టి గర్భం ధరించినప్పటికీ గర్భస్రావం కావడంతో అది నిలవలేదు. ఈ నేపథ్యంలో ఈ సారి అంతా టెన్షన్ పడ్డారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా సుఖ ప్రసవం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నో మొక్కుల తర్వాత కలిగిన సంతానం కావడంతో శిల్పా, రాజ్ కుంద్రాలు వియాన్ ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. శిల్పా శెట్టి పూర్తిగా వియాన్ పెంపకానికే పరిమితం అయింది.
శిల్పా శెట్టి తెలుగు ప్రేక్షకులకు చాలా కాలం క్రితమే పరిచయం అయింది. వెంకటేష్ హీరోగా వచ్చిన 'సాహస వీరుడు సాగర కన్య' చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శిల్పా శెట్టి ఆ తర్వాత 'వీడేరా దాని బాబు', నాగార్జున సరసన'ఆజాద్', బాలయ్య సరసన 'భలేవాడివి బాసు' చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications












