twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరమ వీర చక్ర ‘సుబేదార్ జోగిందర్ సింగ్’ జీవితంపై సినిమా

    By Bojja Kumar
    |

    దేశం కోసం మూడు ప్రధాన యుద్ధాల్లో పాల్గొని అసాధారమైన వీరత్వం ప్రదర్శించి పరమ వీర చక్ర అవార్డు పొందారు సుబేదార్ జోగిందర్ సింగ్. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధంలో ఆయన మరణించారు. తాజాగా జోగిందర్ సింగ్ జీవితంపై బయోపిక్ రూపొందుతోంది. పరమ వీర చక్ర పుస్కారం అందుకున్న వారిపై రూపొందుతున్న తొలి బయోపిక్ ఇదే కావడం విశేషం.

    'సుబేదార్ జోగిందర్ సింగ్' పాత్రలో పంజాబీ నటుడు గిప్పీ గ్రెవల్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. పంజాబీతో పాటు హిందీ, తమిళం, తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

     సుబేదార్ జోగిందర్ సింగ్

    సుబేదార్ జోగిందర్ సింగ్

    ‘సుబేదార్ జోగిందర్ సింగ్' చిత్రానికి సిమెర్జిత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమీత్ సింగ్ నిర్మాత. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

     కార్గిల్, డ్రాస్, రాజస్థాన్ లో షూటింగ్

    కార్గిల్, డ్రాస్, రాజస్థాన్ లో షూటింగ్

    సుబేదార్ జోగిందర్ సింగ్ పాల్గొన్న యుద్ధాలు, అతడు ప్రదర్శించిన వీరత్వాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం రూపొందుతోంది. కార్గిల్, డ్రాస్, రాజస్థాన్, అస్సామ్ ప్రాంతాల్లో ఈ చిత్రీకరణ జరిగింది.

     సుబేదార్ జోగిందర్ సింగ్ గురించి...

    సుబేదార్ జోగిందర్ సింగ్ గురించి...

    స్వాతంత్ర్యం రాక ముందు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలోని సిక్ రెజిమెంట్‌లో 1936లో జోగిందర్ సింగ్ రిక్రూట్ అయ్యారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా ఆయన ఇండియన్ ఆర్మీలో సేవలు అందించారు. 1962లో జరిగిన ఇండో-చైనా యుద్ధంలో వేల మంది చైనా సైనికులపై.... జోగిందర్ సింగ్ నేతృత్వంలోని 22 మంది సైనికులు వీరోచిత పోరాటం చేశారు. ఈ యుద్ధంలో జోగిందర్ సింగ్ మరణించారు.

     ముఖ్య తారాగణం

    ముఖ్య తారాగణం

    ఈ చిత్రంలో గిప్పీ గ్రెవాల్ తో పాటు గుగ్గు గిల్, కుల్విందర్ బిల్లా, అదితి శర్మ, రాజ్ వీర్ జవాందా, రోషన్ ప్రిన్స్, కరమ్జీత్ అనుమోల్, సర్దార్ సోహి తదితరులు నటిస్తున్నారు.

    English summary
    Here is the first look of our film "Subedar Joginder Singh". It is nation’s first ever biopic on a Param Vir Chakra Awardee which will be released in three languages other than Punjabi, that is, Hindi, Tamil and Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X