ఊహించని షాక్ ఇచ్చిన నాని:ఈ సాయంత్రమే టైటిల్, ఫస్ట్‌లుక్

కెరీర్ ఇంత పీక్‌లో ఉన్నప్పుడు ప్రొడ్యుసర్ గా మారబోతున్నానని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇప్ప‌టికి 80 శాతం షూటింగ్ పూర్త‌యింది.

Recommended Video

వామ్మో..నాని ఇలా షాక్ ఇచ్చాడేంటీ !

వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న నేచుర‌ల్ స్టార్ నాని సోష‌ల్ మీడియా ద్వారా ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్ మెద‌లుపెట్టి హీరోగా మారిన నాని త్వర‌లోనే నిర్మాత‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. గతం లో ఇలాంటి ప్రయత్నమే చేయబోయి కొంచం చెయ్యి కాలింది కానీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రయత్నం మొదలు పెట్టాడు ఆ విష‌యం వెల్ల‌డిస్తూ నాని త‌న ట్విట‌ర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు.

నాని తొలి సినిమా ఫస్ట్ లుక్

నాని తొలి సినిమా ఫస్ట్ లుక్

ఈ రోజు సాయంత్రం నాని తొలి సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేయనున్నారు. వరుస విజయాలతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న నాని ఇప్పుడు తొలి సినిమా చేయటం ఏంటి అనుకుంటున్నారా..? హీరోగా మంచి విజయాలు సాధించిన నాని తొలిసారిగా పూర్తి స్థాయి నిర్మాతగా మారి ఓ సినిమా చేయబోతున్నాడు.

టాప్ రేంజ్ స్టార్ హీరో

టాప్ రేంజ్ స్టార్ హీరో

టాప్ రేంజ్ స్టార్ హీరోలను.. గ్రేడ్ హీరోలుగా పరిగణించడం టాలీవుడ్ ఆనవాయితీ. ఇందులోకి నాని గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేయడం ఖాయంగా చెప్పచ్చు. భలే భలే మగాడివోయ్ బ్లాక్ బస్టర్ నుంచి రీసెంట్ గా నిన్నుకోరి వరకూ నాని నటించిన అన్ని సినిమాలు హిట్లే. మధ్యలో కృష్ణగాడి వీర ప్రేమగాథ.. మజ్నులు మాత్రం కాసింత యావరేజ్ గా నిలిచాయి.

35 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్

35 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్

కానీ కృష్ణగాడి వీర ప్రేమగాథ తర్వాత జెంటిల్ మ్యాన్ అంటూ.. మజ్ను తర్వాత నేను లోకల్ మూవీతో నాని బౌన్స్ బ్యాక్ అయిన తీరు అసమాన్యం. ఇప్పుడు నాని నటిస్తున్న ఎంసీఏ 35 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇందులో థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 25 కోట్లు కాగా.. శాటిలైట్ 6 కోట్లు.. డిజిటల్ ఫార్మాట్ లో 5.5 కోట్లు వచ్చాయట.

 వాయిస్ ఓవ‌ర్ చెప్ప‌మ‌ని అడ‌గ‌డానికి

వాయిస్ ఓవ‌ర్ చెప్ప‌మ‌ని అడ‌గ‌డానికి

తర్వాతి చిత్రాలతో నాని రేంజ్ 40 కోట్లు దాటిపోవడం ఖాయం. ఇక కెరీర్ ఇంత పీక్‌లో ఉన్నప్పుడు ప్రొడ్యుసర్ గా మారబోతున్నానని చెప్పి షాక్ ఇచ్చాడు. "ఈ ఏడాది ఆరంభంలో ప్ర‌శాంత్ అనే వ్య‌క్తి నాకొక క‌థ చెప్పాడు. ఆ సినిమాలో ఓ పాత్ర‌కు వాయిస్ ఓవ‌ర్ చెప్ప‌మ‌ని అడ‌గ‌డానికి నా ద‌గ్గ‌రకు వ‌చ్చాడు.

నేనే మేనేజ్ చేస్తున్నా

ఆ క‌థ చాలా బాగుంది. ప్రొడ్యూస‌ర్ ఎవ‌రు అని అడిగాను. "ప్రొడ్యూస‌ర్ ఎవ‌రూ లేరు. నేనే మేనేజ్ చేస్తున్నా` అన్నాడు. ఆ క‌థ‌ని మేనేజ్ చేయ‌కూడ‌దు. చాలా బాగా తీయాల‌ని నేనే ప్రొడ్యూస‌ర్‌గా మారాను. ఇప్ప‌టికి 80 శాతం షూటింగ్ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. శ‌నివారం సాయంత్రం టైటిల్ విడుద‌ల చేస్తున్నామ‌`ని నాని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X