వీణా మాలిక్ ‘డ్రామా క్వీన్’ ఫస్ట్ లుక్
ముంబై: బాలీవుడ్ అవకాశాలు దక్కించుకోవడమే లక్ష్యంగా భారత్‍లో అడుగు పెట్టి వీణా మాలిక్ ఆ మధ్య న్యూడ్ ఫోటో షూట్లు, పలువు బాలీవుడ్ సెలబ్రిటీలతో ఎఫైనర్లు నడుపుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచని విషయం తెలిసిందే. తాజాగా వీణా మాలిక్ 'డ్రామా క్వీన్' అనే ఆల్బమ్ తో రాబోంది. లేడీ గగా, రిహానా లాంటి పాప్ స్టార్ల అనుకరిస్తూ ఈ ఆల్బం రూపొందుతోంది. తాజాగా ఈ ఆల్బమ్‌లో వీణా మాలిక్‍కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.
దీని గురించి వీణా మాలిక్ మాట్లాడుతూ...'ఇదొక మంచి మూమెంట్. నేను తొలిసారిగా ఆల్బమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యూత్‍ని ఆకట్టుకుంటూ ఈ జనరేషన్ లైఫ్ స్టైల్‌ను అనుకరిస్తూ ఈ ఆల్బం సాగుతుందని వీణా వెల్లడించింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు....న్యూడ్ ఫోజుల దగ్గర నుంచి ఈ ఆల్బం వరకు హాలీవుడ్ తారలను అనుసరిస్తున్న వీణా ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.
టాప్‌లెస్, న్యూడ్ ఫోటో ఫోజులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న పాకిస్థాన్ నటి. న్యూడ్ ఫోజులు ఇచ్చినందుకు పాకిస్థాన్ నుంచి ఎన్నో రకాలైన బెదిరింపులు వచ్చినప్పటికీ.. ఏమాత్రం బెదరక.. తన పంథాలో ముందుకు సాగుతోంది వీణా మాలిక్.
ప్రస్తుతం వీణా మాలిక్ బాలీవుడ్‌లో 'ముంబై 125 కి.మీ' చిత్రంతోపాటు 'జిందగి 50-50' అనే చిత్రంలో నటిస్తోంది. రాజీవ్ రుయా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వీణా సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తోంది. ఇందులో ఓ సీన్లో పూర్తి నగ్నంగా నటిస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సెక్స్ బాంబుగా ముద్ర వేయించుకుని శృంగార ప్రధానమై పాత్రలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వీణా మాలిక్ నిర్మాతలు టాప్ లెస్ ప్రపోజల్ తేగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పేసుకుందట.


Click it and Unblock the Notifications












