రామ్ 'మసాలా' ఫస్ట్ లుక్(ఫోటో)

By Srikanya

హైదరాబాద్: వెంకటేష్,రామ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'మసాలా' . హిందీలో విజయవంతమైన 'బోల్‌ బచ్చన్‌' ఆధారంగా తెరకెక్కించారు. అంజలి, షాజన్‌ పదమ్‌సీ హీరోయిన్స్. కె.విజయ్‌భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి రవికిషోర్‌ నిర్మాత. డి.సురేష్‌బాబు సమర్పకులు. ఈ చిత్రం ఫస్ట్ లుక్( తొలి ప్రచార చిత్రం) విడుదల చేశారు.

వెంకటేష్, రామ్ అభిమానులు పండుగ చేసుకునేలా 'మసాలా' సినిమా ఫస్ట్ లుక్ విడుదలయింది. సినిమా నిర్మాతలు అధికారికంగా దీన్ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ ఫోటోని సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో వెంకటేష్, రామ్ ఫోటో పెట్టిన సంగతి తెలిసింది. చూడగానే ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు చాలా టైటిళ్లు ప్రచారంలోకి వచ్చాయి. 'మసాలా' పోస్టర్ విడుదలతో టైటిల్ పై క్లారిటీ వచ్చినట్లైంది.

వెంకటేష్ సరసన అంజలి, రామ్ కు జోడీగా షాజన్ పదమ్ సి నటించారు. 'మసాలా' ఆడియో దసరాకు విడుదల చేయనున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. అక్టోబర్ చివరి వారంలో సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. వెంకటేష్, రామ్ తొలిసారిగా కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. హీరోయిన్స్ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది. దసరా పండగ రోజున పాటల్ని విడుదల చేస్తాం. అక్టోబరు నెలాఖరున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X