ఇలియానా పెదాలు అందుకున్న లక్కీ ఫెల్లో...
సౌతిండియా సెక్సీ తార ఇలియానా అందం అభినయం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చూడటానికి బక్క పలుచగా, కండలేనట్లుగా ఉన్నప్పటికీ అమ్మడుకి అభిమానులు ఎక్కువే. ఇలియానా ఇంత టాప్ రేంజికి చేరడానికి ఆమె అభినయంతో పాటు...యూత్ కు మత్తెక్కించే బాడీ స్టక్చర్, వయ్యారాలు ఒలకపోసే సెక్సీ తనమే కారణం. ఇలియానా కెరీర్ స్టార్ట్ చేసి ఇన్నేళ్లయినా, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించినా...ఇప్పటికీ ఆమె ఎక్స్ ఫోజింగ్, లిప్ లాక్ సీన్లకు దూరంగానే ఉంది. ఆమెతో లిప్ లాక్ చేయాలని చాలా మంది హీరోలు ట్రై చేసినా ఇప్పటి వరకు ఎవరికీ ఆ అవకాశం ఇవ్వలేదు ఈ గోవా సుందరి.
అయితే ఎట్టకేలకు ఇలియానా దిగిరాక తప్పలేదు. తన అదరామృతాలను తన కోస్టార్ కు సమర్పించుకోకతప్పలేదు. హిందీ 3 ఇడియట్స్ రీమేక్‌గా తమిళంలో 'నంబన్' చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హిందీలో అమీర్ ఖాన్ పోషించిన పాత్రను విజయ్ చేయగా, కరీనా కపూర్ చేసిన క్యారెక్టర్ లో ఇలియానా నటించింది. హిందీ వెర్షన్లో అమీర్ ఖాన్-కరీనా మధ్య ఘాడమైన ముద్దు సీన్ ఉంది. సేమ్ సీన్ ను నంబన్ లోనూ రిపీట్ చేశాడు దర్శకుడు. కథ డిమాండ్ చేసింది కాబట్టి ఇలియానా ముద్దు సీన్ కు ఒప్పుకోక తప్పలేదు. నంబన్ సినిమా తెలుగులో 'స్నేహితుడు' పేరుతో ఈ నెలలోనే విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











