మొదట మహేష్ ఆ తర్వాతే జూ ఎన్టీఆర్...!
నిన్నటివరకు అభిమానులును అయోమయంలో పడేసిన బృందావనం మరియు ఖలేజా రిలీజ్ డేట్స్ గురించి ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం జరిగింది. ఎట్టిపరిస్దితుల్లోనూ అక్టోబర్ 8న బృందావనం రిలీజ్ ఉంటుందన్న దిల్ రాజు సడన్ గా తన పంథా మార్చుకోని, ఖలేజా కు దారివ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రిన్స్ మహేష్ ఖలేజా ఆడియో రిలీజ్ సెప్టెంబర్ 27న చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. దానితో సినిమా కూడా చాలా త్వరగా రిలీజ్ చెయ్యాలని సదరు నిర్మాత మీద ఒత్తిడి రావడంతో అక్టోబర్ 7న ఖలేజాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా బృందావనం సినిమాని అక్టోబర్ 13న విడుదల చేయడానికి దిల్ రాజు సన్నాహాలు చేసుకున్నట్లు తేలుస్తుంది. దీనితో అభిమానులలో నెలకోన్న సందిగ్దం తోలగిపోయింది. ఇక అభిమానులే తమ సినిమాలను బ్రతికించాలని సదరు హీరోలు అనుకున్నట్లు సమాచారం.
మహేష్ బాబు అనుష్క జూ ఎన్టీఆర్ సమంత కాజల్ బృందావనం ఖలేజా దిల్ రాజు mahesh babu anushka jr ntr samantha kajal brindavanam khaleja dil raju


Click it and Unblock the Notifications