Rakul Preet Wedding Photos ఘనంగా రకుల్ ప్రీత్ పెళ్లి.. పేరు మార్చుకొన్నానంటూ షాకింగ్‌గా ఇన్స్‌టా పోస్ట్!

సినీ తార రకుల్ ప్రీత్ సింగ్ ఎట్టకేలకు గృహిణిగా మారిపోయింది. గత కొద్దికాలంగా మీడియాలో వస్తున్న పెళ్లి వార్తలకు తెర దించుతూ తాను సుదీర్ఘంగా ప్రేమాయణం సాగిస్తున్న బాలీవుడ్ నిర్మాత జాకీ భగాన్నీతో వివాహం జరిగింది. గోవాలో జరిగిన ఈ పెళ్లికి బాలీవుడ్‌కు చెందిన అతి కొద్ది మంది హాజరయ్యారు. వివాహం అనంతరం అధికారికంగా విడుదల చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఈ వివరాల్లోకి వెళితే..

నాలుగు సంవత్సరాలుగా ప్రేమాయణం
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ కొద్దికాలంగా ప్రేమించుకొంటున్నారు. సుమారు నాలుగు సంవత్సరాల క్రితం తమ ప్రేమను అధికారికంగా వెల్లడించిన తర్వాత వారిద్దరూ పలు చోట్ల చెట్టాపట్టాలేసుకొని విహారయాత్రలు చేసుకొన్నారు.

First photo of Rakul Preet Singh Wedding With Jackky Bhagnani Trenidng in Social Media

గోవాలో గ్రాండ్‌గా వివాహం
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ చాలాకాలం డేటింగ్ చేసిన అనంతరం ఫిబ్రవరి 21వ తేదీన గోవాలో సిక్కు, ఆనంద్ కరాజ్ పద్దతుల ద్వారా వివాహం చేసుకొన్నారు. వీరి వివాహం సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

First photo of Rakul Preet Singh Wedding With Jackky Bhagnani Trenidng in Social Media

సంగీత్‌లో శిల్పాశెట్టి హంగామా
రకుల్ ప్రీత్, జాకీ పెళ్లికి ముందు జరిగిన సంగీత్ కార్యక్రమంలో బాలీవుడ్ సెలబ్రెటీ కపుల్స్ శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా చేసిన డ్యాన్స్ వైరల్ అయింది. ముండియా తు బచ్ కే పాటపై ఇద్దరు వేసిన స్టెప్పులు కేక పెట్టించాయి. సంగీత్ ఫంక్షన్‌కు హీరో హీరోయిన్లు రితేష్ దేశ్‌ముఖ్, భూమీ పెడ్నేకర్ హోస్ట్ చేశారు. ఈ సంగీత్‌లో ఎక్కువగా షారుక్ ఖాన్ సినిమా పాటలకు అందరూ స్టెప్పులు వేశారు.

ఎన్విరాన్ మెంట్ పెండ్లీ
తమ పెళ్లిలో పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా ఎన్వీరాన్‌మెంట్ ఫ్రెండ్లీ పద్దతులను ఆచరించారు. పేపర్ వాడకుండా, టపాసులు కాల్చకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. విలాసవంతమైన ఆహారం కాకుండా సాత్విక భోజనాన్ని అతిథులకు వడ్డించారు.

First photo of Rakul Preet Singh Wedding With Jackky Bhagnani Trenidng in Social Media

ఇన్స్‌టాగ్రామ్‌లో ఫోటోలు
పెళ్లి అనంతరం వధూవరుల ఫోటోలను రిలీజ్ చేశారు. పెళ్లిపీటలపై దిగిన ఫోటోలను రకుల్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక నుంచి నీవు నా వాడివి. ఇప్పుడు మనిద్దరం భగ్నానీలం అయ్యాం అంటూ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X