వైభవంగా అనుష్క-విరాట్ ఢిల్లీ వెడ్డింగ్ రిసెప్షన్, ప్రధాని మోడీ హాజరు (ఫోటోస్)
Recommended Video

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఇటలీ వివాహం అనంతరం ఆర్కిటిక్ లో హనీమూన్ పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వచ్చారు. పెళ్లి వేడుక ప్రైవేట్‍గా జరుగడంతో ఢిల్లీలో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
తమ వెడ్డింగ్ రిసెప్షన్ కు రావాల్సిందిగా విరాట్-కోహ్లి స్వయంగా ప్రధాన మంత్రిని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం జరిగిన వేడుకకు మోడీ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

లుక్ అదిరిపోయింది
వెడ్డింగ్ రిసెప్షన్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులు ధరించిన అనుష్క-విరాట్ లుక్ అదిరిపోయింది.

సబ్యాసాచి ముఖర్జీ డిజైన్స్
వెడ్డింగ్ రిసెప్షన్లో అనుష్క, విరాట్ వేసుకున్న దుస్తులు సబ్యాసాచి ముఖర్జీ డిజైన్ చేశారు. ఎరుపు రంగు బెనారస్ చేనేత చీర ధరించిన అనుష్క సంప్రదాయ లుక్ లో ఆకట్టుకుంది. అనుష్కకు ఏ మాత్రం తీసిపోకుండా కోహ్లి నలుపురంగ స్టక్చర్ ఉన్న 18 క్యారెట్ల బంగారు గుండీలు పొదిగిన సిగ్నేచర్ బంద్‌గాలా, సిల్క్ కుర్తా ధరించారు.

తాజ్ హోటల్‌లో
ఢిల్లీ చాణక్యపురిలోని తాజ్ హోటల్ దర్బార్ హాలులో ఈ వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. అతిథుల కోసం పసందైన వంటకాలు వడ్డించారు.

మధుర క్షణాలు
తమ పెళ్లి వేడుక, వెడ్డింగ్ రిసెప్షన్ జీవితంలో ఎప్పటికీ గుర్తుండి పోయేలా అనుష్క-విరాట్ ముందు నుండీ ప్లాన్ చేసుకున్నారు. వారు అనుకున్న విధంగా ఏర్పాట్లన్నీ సజావుగా సాగాయి. డిసెంబర్ 11న వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో కూడా వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది.


Click it and Unblock the Notifications











