»   » పెళ్లి సందడి: చైతన్య పెళ్లి కొడుకయ్యాడు (ఫోటోలు)

పెళ్లి సందడి: చైతన్య పెళ్లి కొడుకయ్యాడు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగ చైతన్య, సమంత వివాహం నేడు(అక్టోబర్ 6) గోవాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించి తొలి ఫోటో బయటకు వచ్చింది. చైతు పెళ్లి కొడుకుగా ముస్తాబైన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అయింది.

ఒక వైపు తండ్రి నాగార్జున, మరో వైపు మేనమామ వెంకటేష్.... మధ్యలో నాగ చైతన్య కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క పెట్టుకుని పెళ్లికి సిద్ధమైన ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

వివాహ ముహూర్తం

వివాహ ముహూర్తం

సమంత, నాగ చైతన్య వివాహానికి అక్టోబర్ 6వ తేదీ రాత్రి 11.52 గంటలకు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. ఈ వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం జరుగనుంది. అంతకుంటే ముందు మధ్యాహ్నం 3 గంటలకు నుండి సాయంత్రం 6 గంటల వరకు మెహందీ వేడుక జరుగనుంది.

Samantha Chit Chat With Fans On Twitter మీ బిడ్డకు అతడి పేరు పెడతారా?
వెడ్డింగ్ కార్డ్

వెడ్డింగ్ కార్డ్

ఈ వివాహ వేడుకకు కొద్ది సంఖ్యలో మాత్రమే గెస్టులు హాజరు కాబోతున్నారు. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సమంత ఫ్యామిలీ హాజరు కానుంది.

సమంత, చైతు

సమంత, చైతు

హిందూ సాంప్రదాయంలో జరిగే వివాహ వేడుకలో నాగ చైతన్య గ్రాండ్ మదర్ డి రాజేశ్వరి చీరను సమంత ధరించనుంది. దీంతో పాటు ఆమెకు సంబంధించిన బంగారు నగలను సమంత ధరించనుంది. నాగ చైతన్య ట్రెడిషనల్ ధోతీ ధరిస్తారు.

శనివారం క్రిస్టియన్ వెడ్డింగ్

శనివారం క్రిస్టియన్ వెడ్డింగ్

సమంత, నాగ చైతన్య క్రిస్టియన్ వెడ్డింగ్ శనివారం సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల మధ్యలో జరుగనుంది.

English summary
Samantha – Naga Chaitanya‘s wedding day is finally here. The wedding is taking place at W resorts in Goa. Today, they will get married the traditional way and guess what, Nagarjuna has given us the FIRST glimpse of the bridegroom!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu