Pawan Kalyan's First Insta Post.. రేణుదేశాయ్ ఫోటో ఉందా? ఎవరెవరి ఫోటోలు ఉన్నాయంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్... ఓవైపు రాజకీయాల్లో బిజి బిజిగా గడుపుతూ.. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నారు. రీసెంట్ గా ఆయన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. వివరాళ్లోకి వెళితే..
ప్రజలకు మరింత చేరువయ్యేందుకు..:పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరుకు యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓవైపు ఏపీ ఎన్నికల సభలు, పర్యటనల్లో పాల్గొంటునే.. మరోవైపు సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఆయన తన మేనల్లుడు మెగా హీరో సాయితేజ్ తో కలిసి నటించిన 'బ్రో' చిత్రం విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలకు, అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ తెరిచారు.

రికార్డు క్రియేట్..:ఇప్పటివరకు ఒక్క పోస్ట్ పెట్టని ఈ అకౌంట్ కు తెరిచిన గంటల్లోనే లక్షల ఫాలోవర్స్ వచ్చారు. బయోలో ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో జై హింద్ అని పవన్ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే పవన్ ఓ సంచలన రికార్డు కూడా సృష్టించారు. అకౌంట్ క్రియేట్ చేసిన 6 గంటల్లోనే 10 లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. దీంతో ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే అత్యధిక ఇన్ స్టా ఫాలోవర్లను పొందిన ఏకైక టాలీవుడ్ నటుడిగా రికార్డుకెక్కారు.
తొలి పోస్ట్ గా వీడియో...:అయితే ఈ ఇన్ స్టా ఓపెన్ చేసినప్పటి నుంచి పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడటం ప్రారంభించారు. పవన్ మొదట ఎలాంటి పోస్ట్ పెడతారు అంటూ తెగ ఎదురుచూశారు. ఎట్టకేలకు తన మొదటి పోస్ట్ చేశారు. చిత్రసీమతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ చిన్న నటులు, నిర్మాతలు, దర్శకుల నుంచి దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులతో దిగిన ఫొటోలన్నింటినీ ఒకే చోట జోడిస్తూ ఓ ప్రత్యేకమైన వీడియోను పోస్ట్ చేశారు.

వీడియోలో ఎవరెవరున్నారంటే..:ఈ వీడియోలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, అమితాబ్ బచ్చన్, మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, హరికృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, రవితేజ, సమంత, ఇలియానా, సాయితేజ్, దర్శకులు రాఘవేంద్రరావు, దాసరి సత్యనారాయణ, రాజమౌళి, హరీశ్ శంకర్, పూరి జగన్నాథ్, మ్యూజిక్ డైరెక్టర్స్ అనిరూధ్, తమన్, మణిశర్మ, కమెడియన్స్ బ్రహ్మానందం, హైపర్ ఆది, సునీల్, వేణు నిర్మాతలు సురేశ్ బాబు, బోణీకపూర్ తో దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. ఇక వీడియో చివర్లో విక్రమ్, విజయ్ దళపతి, కార్తితో దిగిన ఫొటోలతో ముగించారు.
"ఎప్పటికీ గుర్తండిపోయే జ్ఞాపకాలు చలనచిత్రసీమ పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులు నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుడ్ణి. మన బంధం ఇలానే కొనసాగాలని మరెన్నో జ్ఞాపకాలని పంచుకోవాలని" అంటూ పవన్ రాసుకొచ్చారు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు నెటిజన్లు వీడియోను తెగ షేర్ చేస్తూ ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు. పవన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. లైక్స్ , కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.


Click it and Unblock the Notifications











