ఎంత అద్భుతంగా ఉందో.... ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది!
బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తూ క్రిష్ జాగర్ణమూడి దర్శకత్వంలో మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కుతున్న బయోపిక్ చిత్రానికి సంబంధించిన తొలి సాంగ్ విడుదలైంది. ఈ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా... ఎన్టీఆర్ సీనీ జీవితాన్ని 'మహానాయుడు' పేరుతో, రాజకీయ జీవితాన్ని 'మహానాయకుడు' పేరుతో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా మొదటి భాగం 'కథానాయకుడు'లోని తొలి పాటను విడుదల చేశారు. ఎన్టీఆర్ తన సీనీ జీవితంలో పోషించిన పాత్రలను అద్భుతంగా వర్ణిస్తూ రచయితలు కె. శివదత్తా, కె రామకృష్ణ ఈ పాట రాశారు. ప్రముఖ గాయకుడు కైలాష్ ఖెర్ వాయిస్ దీన్ని మరో లెవల్‌కి తీసుకెళ్లింది.
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తన అనుభవాన్నంతా రంగరించి వినసొంపుగా, ఆహా అని మైమరిచిపోయేలా బాణీలు కట్టారు. ఆదివారం ఉదయం విడుదలైన సాంగుకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

అతను కథగా మారితే, 'కథానాయకుడు'.. అతనే ఓ చరిత్రయితే, 'మహానాయకుడు'...ఇలా ఎన్టీఆర్ జీవితంలోని వివిధ కోణాలను తెరపై ఆవిష్కరిస్తూ బయోపికక్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 9 న ఎన్టీఆర్ కథానాయకుడు, జనవరి 24 నమహానాయకుడు విడుదలకు సిద్ధమైంది.


Click it and Unblock the Notifications











