»   »  బాహుబలి 2.... నుండి ఫస్ట్ స్నాప్ ఇదే (ఫోటో)

బాహుబలి 2.... నుండి ఫస్ట్ స్నాప్ ఇదే (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి-ది బిగినింగ్' గతేడాది రిలీజై బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేసింది. ప్రస్తుతం 'బాహుబలి' పార్ట్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2015 డిసెంబర్లో షూటింగ్ మొదలైంది. ఇటీవలే కేరళలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో యూ ఎస్ షెడ్యూల్‌కు వెళ్ళనున్న రాజమౌళి అండ్ టీం ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది చివరిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు బాహుబలి-2 సినిమాకు సంబంధించి సమాచారమే తప్ప యూనిట్ నుండి ఎలాంటి ఫోటో బయటకు రాలేదు. తాజాగా ఈచిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ బాహుబలి సెట్స్ కు సంబంధించిన తొలిస్నాప్ రిలీజ్ చేసారు. దర్శకుడు రాజమౌళి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కలిసి చర్చిస్తున్న ఫోటోను శోభు షేర్ చేసారు.


Also Read: బాహుబలి-2 : ప్రభాస్ డైట్, జిమ్ వర్కౌట్స్ వివరాలు


బాహుబలి-2కు సంబంధించిన తొలి స్నాప్ ఇది..... ఇక కంటిన్యూగా బాహుబలి సెట్స్ నుండి ఫోటోస్ వస్తూనే ఉంటాయి అంటూ శోభు యార్ల గడ్డ ట్వీట్ చేసారు. సో..... ఓ వైపు షూటింగ్ కొనసాగిస్తూ మరో వైపు సినిమాపై జనాల్లో అంచనాలు పెంచేలా ప్లాన్డ్ గా ముందుక సాగుతున్నట్లు స్పష్టం అవుతోంది.


Also Read: టాలీవుడ్లో హయ్యెస్ట్ రెమ్యూరేషన్ తీసకునే హీరో ఎవరు?


 First Snap From Baahubali 2 Sets

మరిన్ని జాగ్రత్తలు...
గతేడాది విడుదలైన బాహుబలి అంతా బాగానే ఉన్నా..... హాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా చూసే వాళ్లకి మాత్రం 'బాహుబలి'లో చాలా మిస్టేక్స్ కనిపించాయి. మనదేశంలోని సినిమా ప్రమాణఆలతో పోలిస్తే 'బాహుబలి' విజువల్ వండరే కానీ... ప్రపంచ స్థాయితో పోలిస్తే ఈ చిత్రం విజువల్ ఎపెక్ట్ష్ పరంగా చాలా పూర్ అనే విమర్శలు వచ్చాయి.


ఈ నేపథ్యంలో ఈ విమర్శలను దృష్టిలో పెట్టుకున్న రాజమౌళి... ప్రస్తుతం తెరకెక్కిస్తున్న బాహుబలి పార్ట్ 2లో మాత్రం అలాంటి మిస్టేక్స్ రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. సినిమాలో మెయిన్ గా హైలెట్ అయ్యేవి విజువల్ ఎఫెక్ట్స్ కాబట్టి...ఈ సారి ఈ విషయంలో మరింత పర్‌ఫెక్ట్ వ్యవహరించబోతున్నారు. ఇందుకోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ ను రంగంలోకి దింపబోతున్నారట.


చైనాలో... రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ 'బాహుబలి' ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. దేశీయంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ చిత్రం బాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి తోసింది. తాజాగా ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ 'బాహుబలి' మరో 100 కోట్లు రాబడుతుందని భావిస్తున్నారు. చైనీస్ బాషతో పాటు ఇంగ్లీష్ బాషలోకి అనువదించినట్లు సమాచారం. ఇందుకోసం అంతర్జాతీయ నిపుణులతో ఎడిటింగ్ చేయించారు. ఈ స్టార్ ఫిలింస్ వారు 6వేల ప్రింట్లతో చైనాలో ఈ సినిమా మే నెలలో రిలీజ్ చేస్తున్నారు.

English summary
Baahubali 2 fever has already begun and any update that is related to the conclusion part is a piece of sensation. While there are some leaked pictures making rounds, here is an official one directly from the producer Shobu Yarlagadda himself.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu