twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఒక్క క్షణం' ఫస్ట్ టాక్: ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందట..

    |

    హీరోగా ఎంట్రీ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా.. 'శ్రీరస్తు శుభమస్తు' లాంటి ఒక మోస్తరు హిట్ తోనే సరిపెట్టుకున్నాడు అల్లు శిరీష్. ఎలాగైనా హీరోగా నిలదొక్కుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా.. ఇప్పుడు 'ఒక్క క్షణం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2017ను విజయంతో ముగించాలని భావిస్తున్న ఈ మెగా హీరోకు.. ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో నేడు తేలిపోనుంది..

    Recommended Video

    'ఒక్క క్షణం' పై ఇవే హైప్ పెంచాయి..

    ఒక్క క్షణం విడుదల నేపథ్యంలో.. సినిమాకు సంబంధించి అప్పుడే ఫస్ట్ టాక్ బయటకొచ్చింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..

     కథకు మంచి మార్కులే!:

    కథకు మంచి మార్కులే!:

    రెండు జంటల సమాంతర జీవితాన్ని ఆధారంగా చేసుకుని.. ఏక కాలంలో వారివురి జీవితాల్లో చోటు చేసుకునే ఒకే రకమైన సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. గతంలో ఎక్కడికిపోతావు చిన్నవాడా! వంటి డిఫరెంట్ సబ్జెక్టుతో ప్రేక్షకులను థ్రిల్ చేసిన దర్శకుడు విఐ ఆనంద్.. కథ విషయంలో ఈసారి కూడా సక్సెస్ అయ్యాడని చెబుతున్నారు. కథ పరంగా ఆనంద్ మరోసారి మంచి మార్కులే కొట్టేశాడన్న టాక్ వినిపిస్తోంది.

     అక్కడ తడబడ్డాడు..:

    అక్కడ తడబడ్డాడు..:

    కథలో బలం ఉన్నప్పటికీ దాని విస్తరణలో మాత్రం అంత బలం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ప్రధాన బలం స్క్రీన్ ప్లే అన్న సంగతి తెలిసిందే. తదుపరి సన్నివేశం ప్రేక్షకుడి ఊహకు అందకుండా ఉంటేనే థ్రిల్లింగ్ ఫీలింగ్ కలిగించగలదు. కానీ దర్శకుడు విఐ ఆనంద్ ఇక్కడ కాస్త తడబడ్డానే చెబుతున్నారు.

     భారీ ట్విస్ట్‌తో 'ఇంటర్వెల్' ..:

    భారీ ట్విస్ట్‌తో 'ఇంటర్వెల్' ..:

    ఒక్క క్షణం ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుందట. ఈ ట్విస్ట్ తర్వాత సెకండాఫ్ పై సగటు ఆడియెన్ ఆసక్తి మరింత పెరుగుతుందని అంటున్నారు.

     'థ్రిల్లింగ్'.. సెకండాఫ్:

    'థ్రిల్లింగ్'.. సెకండాఫ్:

    ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత సెకండాఫ్ లోనూ అదే తీక్షణతో థ్రిల్ చేసే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయట. ట్రైలర్‌లో చూపించిన విధంగానే అవసరాల శ్రీనివాస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.

     అక్కడ కాస్త జాగ్రత్తపడి ఉంటే..:

    అక్కడ కాస్త జాగ్రత్తపడి ఉంటే..:

    స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్తపడితే బాగుండేది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్ని సాధారణంగా స్లో స్క్రీన్ ప్లే తోనే సాగిపోయినప్పటికీ.. ప్రతీ సన్నివేశం తదుపరి సన్నివేశంపై మరింత ఆసక్తిని పెంచుతూ పోవాలి. కానీ ఒక్క క్షణంలో అది మిస్ అవడమే పెద్ద మైనస్ అంటున్నారు.

     ఫైనల్‌గా ఫస్టాక్ ఇది..:

    ఫైనల్‌గా ఫస్టాక్ ఇది..:

    సరే, ఏదెలా ఉన్నప్పటికీ.. ఒక్క క్షణం సినిమా కచ్చితంగా ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్ మాత్రం కలిగిస్తుందనే చెబుతున్నారు. కథా బలం ఉన్న సినిమా కావడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఈ మధ్యాహ్నానికి సినిమాకు సంబంధించి పూర్తి రిపోర్ట్ వస్తుంది కాబట్టి.. సమీక్షతో మరిన్ని వివరాలు తెలుస్తాయి.

    English summary
    Allu Sirish's latest movie Okka Kshanam getting possitive buzz from audience. First talk of the Okka Kshanam is in favour to film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X