twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాంచన్‌ నీ కాల్మొక్త'.. (ఇంకెన్నాళ్లు)

    By Srikanya
    |

    'బాంచన్‌ నీ కాల్మొక్త' (ఇంకెన్నాళ్లు) అనే టైటిల్ తో పూర్తి తెలంగాణ నటీనటులు, సాంకేతిక నిపుణలతో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో మారుతి మూవీస్‌ పతాకంపై ఎం.జస్వంత్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో రికార్డింగ్‌, షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని రమేష్‌ తుమ్మల అనే దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఎం.చంద్రమౌళిగౌడ్‌ సమర్పకుడు. కెమెరా ఎం.నర్సింగ్‌, సంగీతం బల్లేపల్లి మోహన్‌. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా, తెలంగాణ మాండలికంలో ఈ సినిమా ఉంటుందని, అన్ని ప్రాంతాల ప్రేక్షకులూ చూసి ఆదరించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాత, దర్శకుడు తెలిపారు.

    ఇక అమ్రేష్‌కుమార్‌ అధ్యక్షతన 'తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌', సి.వి.ఎల్‌.నరసింహారావు అధ్యక్షతన 'మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ', డాక్టర్‌ ఎల్‌.శ్రీనాథ్‌ అధ్యక్షతన 'తెలంగాణ ఫిలిం డైరెక్టర్స్‌ అసోసియేషన్‌', సురేష్‌ కుమార్‌ అధ్యక్షతన 'తెలంగాణ టీవీ మీడియా అసోసియేషన్‌', ఎం. జస్వంత్‌రెడ్డి అధ్యక్షతన 'తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌'ను స్థాపించారు. తాము స్ధాపించిన ఈ సంస్థలన్నీ తెలంగాణ నిర్మాతలు నిర్మించే చిత్రాలకు అండగా ఉంటాయని జస్వంత్‌రెడ్డి తెలిపారు.

    1 | 2 | 3

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X